ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో సైనా నెహ్వాల్ ఓటమికి కలుషితాహారమే కారణమని కోచ్ విమల్ కుమార్ తెలిపారు.
ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో సైనా ఓటమి
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో సైనా నెహ్వాల్ ఓటమికి కలుషితాహారమే కారణమని కోచ్ విమల్ కుమార్ తెలిపారు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్ తర్వాత సిడ్నీలోని ఓ భారతీయ రెస్టారెంట్‌లో ఆమె ఆహారం తీసుకుందని చెప్పారు. దీని తర్వాత ఫుడ్ పాయిజనింగ్ కావడంతో సైనా అనారోగ్యానికి గురైందన్నారు. నీరసంతో కనీసం ప్రయా ణం చేయడానికి కూడా ఇబ్బంది తలెత్తిందని, దీని కారణంగానే ఆమె మ్యాచ్‌లో ఓటమిపాలైందని తెలిపారు.