ఎస్‌సీ రైల్వే చెస్‌ టోర్నీ షురూ | SC railway Chess tourney started | Sakshi
Sakshi News home page

ఎస్‌సీ రైల్వే చెస్‌ టోర్నీ షురూ

Dec 26 2017 10:39 AM | Updated on Sep 15 2018 3:30 PM

SC railway Chess tourney started - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) గోల్డెన్‌ జూబ్లీ జనరల్‌ మేనేజర్‌ చెస్‌ కప్‌ సోమవారం ప్రారంభమైంది. సికింద్రాబాద్‌లోని బోయిగూడ రైల్‌ కళారంగ్‌లో దక్షిణ మధ్య రైల్వే క్రీడా సంఘం (ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయి. టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్‌సీఆర్‌ జనరల్‌ మేనేజర్‌ (జీఎం) వినోద్‌ కుమార్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీకి 200మందికి పైగా చెస్‌ క్రీడాకారులు హాజరయ్యారు. ఎస్‌సీఆర్‌కు చెందిన విక్రమ్‌జీత్‌ సింగ్‌ టాప్‌ సీడ్‌గా, తెలంగాణకు చెందిన వి. వరుణ్‌ రెండో సీడ్‌గా బరిలోకి దిగారు.

టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 2.38 లక్షలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ అధ్యక్షులు అర్జున్‌ ముండియా, కార్యదర్శి ఈవీ కృష్ణారెడ్డి, తెలంగాణ చెస్‌ సంఘం అధ్యక్షులు ఎ. నరసింహారెడ్డి, కార్యదర్శి కేఎస్‌ ప్రసాద్, ఎస్‌సీఆర్‌ చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ ఎం. ఉమాశంకర్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement