శశాంక్‌కు మిశ్రమ ఫలితాలు | sashank gets mixed results | Sakshi
Sakshi News home page

శశాంక్‌కు మిశ్రమ ఫలితాలు

Feb 17 2017 10:48 AM | Updated on Sep 5 2017 3:57 AM

శశాంక్‌కు మిశ్రమ ఫలితాలు

శశాంక్‌కు మిశ్రమ ఫలితాలు

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జూనియర్స్‌ గ్రేడ్‌– 5 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ కుర్రాడు మాచెర్ల తీర్థ శశాంక్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.

ఐటీఎఫ్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జూనియర్స్‌ గ్రేడ్‌– 5 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ కుర్రాడు మాచెర్ల తీర్థ శశాంక్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నేపాల్‌లోని ఖట్మాండులో జరుగుతోన్న ఈ టోర్నీలో శశాంక్‌ సింగిల్స్‌ విభాగంలో సెమీస్‌కు చేరగా... డబుల్స్‌ విభాగంలో క్వార్టర్స్‌లో ఓటమి పాలయ్యాడు. గురువారం జరిగిన బాలుర సింగిల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో తీర్థ శశాంక్‌ 6–3, 7–5తో మిచెల్‌ వోజ్నాక్‌ (పొలాండ్‌)పై గెలుపొంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు. మరోవైపు డబుల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో శశాంక్‌– కబీర్‌ మన్‌రాయ్‌ (భారత్‌) ద్వయం 4–6, 4–6తో భారత్‌కే చెందిన పీయూశ్‌ సలేకర్‌ – ఆదిత్య అయ్యర్‌ జంట చేతిలో ఓటమి పాలైంది.

 

Advertisement
 
Advertisement
Advertisement