సర్జుబాల, స్వీటీలకు రజతాలు | Sarjubala, sweety won silver | Sakshi
Sakshi News home page

సర్జుబాల, స్వీటీలకు రజతాలు

Nov 25 2014 12:45 AM | Updated on Sep 2 2017 5:03 PM

సర్జుబాల, స్వీటీలకు రజతాలు

సర్జుబాల, స్వీటీలకు రజతాలు

రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు రజతాలు లభించాయి. 48 కేజీల విభాగం ఫైనల్లో భారత క్రీడాకారిణి సర్జుబాల...

జిజు (కొరియా): ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు రజతాలు లభించాయి. 48 కేజీల విభాగం ఫైనల్లో భారత క్రీడాకారిణి సర్జుబాల... ప్రపంచ మూడో ర్యాంకర్ నేజిమ్ కజిబేవ్ (కజకిస్థాన్) చేతిలో ఓడింది. 81 కేజీల విభాగం ఫైనల్లో స్వీటీ... యాంగ్ జియోలి (చైనా) చేతిలో ఓడిపోయింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కేవలం ఒక్క కాంస్యం మాత్రమే లభించింది. ఈసారి రెండు రజతాలు లభించడం భారత్‌కు మెరుగైన ప్రదర్శన. ఈ సారి భారత్ ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలో నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement