సంతోషి, ప్రియదర్శినిలకు స్వర్ణాలు | Santoshi, priyadarsinila gold | Sakshi
Sakshi News home page

సంతోషి, ప్రియదర్శినిలకు స్వర్ణాలు

Oct 13 2015 1:11 AM | Updated on Sep 3 2017 10:51 AM

సొంతగడ్డపై భారత వెయిట్‌లిఫ్టర్లు పతకాల పంట పండించారు. కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు జూనియర్,

కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్
 పుణే: సొంతగడ్డపై భారత వెయిట్‌లిఫ్టర్లు పతకాల పంట పండించారు. కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు జూనియర్, యూత్, సీనియర్ విభాగాలలో కలిపి తొమ్మిది స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. సీనియర్ మహిళల 53 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స సంతోషి... యూత్ బాలికల 44 కేజీల విభాగంలో టి.ప్రియదర్శిని పసిడి పతకాలను దక్కించుకున్నారు. సంతోషి ఓవరాల్‌గా 190 కేజీలు... ప్రియదర్శిని ఓవరాల్‌గా 128 కేజీలు బరువెత్తి అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఇద్దరితోపాటు మోహిని చవాన్ (48 కేజీలు, యూత్), సంజితా చాను (48 కేజీలు, సీనియర్), జామ్‌జంగ్ డేరూ (56 కేజీలు, యూత్, జూనియర్), సుఖెన్ డే (56 కేజీలు, సీనియర్ పురుషులు), గౌరీ పాండే (53 కేజీలు, యూత్) కూడా స్వర్ణ పతకాలు గెలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement