ఓవరాల్ విజేత సంతోష్ | santosh lifts deloitte monsoon regatta title | Sakshi
Sakshi News home page

ఓవరాల్ విజేత సంతోష్

Jul 18 2016 10:37 AM | Updated on Sep 4 2017 5:16 AM

ఓవరాల్ విజేత సంతోష్

ఓవరాల్ విజేత సంతోష్

డెలాయిట్ మాన్‌సూన్ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో ఆర్‌బీ సంతోష్ ఓవరాల్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. హుస్సేన్‌సాగర్‌లో ఆదివారం ఈ పోటీలు ముగిశాయి.

హైదరాబాద్: డెలాయిట్ మాన్‌సూన్ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో ఆర్‌బీ సంతోష్ ఓవరాల్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. హుస్సేన్‌సాగర్‌లో ఆదివారం ఈ పోటీలు ముగిశాయి. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్‌లో మొత్తం 9 క్లబ్‌లను చెందిన సెయిలర్లు  పాల్గొన్నారు. ఓవరాల్ టీమ్ చాంపియన్‌షిప్‌లో ముంబై విజేతగా నిలవగా, ఎలాంటి అనర్హతకు గురి కాకుండా చిత్రేశ్ మరో విన్నర్ ట్రోఫీని అందుకున్నాడు. మహిళల విభాగంలో హర్షిత తోమర్ ఉత్తమ సెయిలర్‌గా నిలిచింది. వర్ధమాన సెయిలర్లలో అరహంత్ వీరారెడ్డి, పి.సాకేత్ (అండర్-10)కు ప్రత్యేక పురస్కారాలు లభించాయి. ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో డెలాయిట్ చైర్మన్ పీఆర్ రమేశ్ విజేతలకు బహుమతులు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement