నెలరోజుల క్రితం సినిమా రిలీజ్.. ఇంతలోనే విషాదం | Malayalam Actor Santosh Road Accident And Mohanlal Reacts | Sakshi
Sakshi News home page

Actor Santosh: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి.. బాధలో మోహన్‌లాల్

May 5 2026 11:32 AM | Updated on May 5 2026 11:49 AM

Malayalam Actor Santosh Road Accident And Mohanlal Reacts

మలయాళ ఇండస్ట్రీలో విషాదం. ప్రముఖ నటుడు సంతోష్(66).. రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మంగళవారం ఉదయం కేరళలోని పతనంతిట్ట దగ్గర ఈ సంఘటన జరగ్గా.. సంతోష్ ప్రయాణిస్తున్న కారు ఓ వ్యాన్‌ని ఢీ కొట్టడంతో ఈయన అక్కడిక్కడే ప్రాణాలు వదిలేయగా, ఇతడి భార్యకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సంతోష్ మరణవార్త తెలుసుకున్న స్టార్ హీరో మోహన్‌లాల్‌ బాధతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్‌కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి)

1960లో పుట్టిన సంతోష్ కేశవన్ నాయర్ తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. కాలేజీలో మోహన్‌లాల్‌కి ఈయన జూనియర్. ఆ టైంలో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న సంతోష్.. తన అక్కాచెల్లెల్లు వైద్యవృత్తిని ఎంచుకుంటే ఈయన మాత్రం నటుడు అయ్యారు. 1982లో విడుదలైన 'ఇతు నాన్‌గులడే' మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చారు. 100కి పైగా సినిమాల్లో విలనీ, కామెడీ తరహా పాత్రలు చేశారు.

గత నెల 10వ తేదీన విడుదలైన 'భరతనాట్యం 2 మోహినీయాట్టం' సినిమాలోనూ నటించారు. ఈ శుక్రవారమే ఇది ఓటీటీలోకి కూడా రానుంది. ఇంతలోనే సంతోష్.. రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం చెందడంతో మలయాళ నటీనటులు ఈయనకు సంతాపం తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: 'రాజు వెడ్స్ రాంబాయి'లో హీరో నేనే.. ఎందుకు వదిలేశానంటే?)

Advertisement
 
Advertisement
Advertisement