మంజ్రేకర్... నువ్వు క్రికెట్ ఆడావా? | Sanjay Manjrekar faces heat on Twitter | Sakshi
Sakshi News home page

మంజ్రేకర్... నువ్వు క్రికెట్ ఆడావా?

Jul 25 2017 12:42 PM | Updated on Sep 5 2017 4:51 PM

మంజ్రేకర్... నువ్వు క్రికెట్ ఆడావా?

మంజ్రేకర్... నువ్వు క్రికెట్ ఆడావా?

గత రెండురోజుల క్రితం ముగిసిన మహిళల వన్డే వరల్డ్ కప్లో రన్నరప్ గా నిలిచిన భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంటే.. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యత సంజయ మంజ్రేకర్ మాత్రం వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.కే

న్యూఢిల్లీ: గత రెండురోజుల క్రితం ముగిసిన మహిళల వన్డే వరల్డ్ కప్లో రన్నరప్ గా నిలిచిన భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంటే.. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యత సంజయ మంజ్రేకర్ మాత్రం వ్యంగ్యాస్త్రాలు  సంధించాడు. ఫైనల్లో భారత మహిళల ప్రదర్శనను ఎత్తిచూపాడు. ' మిథాలీ రాజ్ శుభారంభం చేసి వుంటే, హర్మన్ ప్రీత్ ఒకటి, రెండు పరుగులపై దృష్టి పెట్టి ఉంటే, వేదా శర్మ తొందర పడకుండా ఉంటే' అంటూ తనదైన శైలిలో సుత్తిమెత్తగా విమర్శలకు దిగాడు.

అయితే ఒక మెగా ఈవెంట్ లో ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత మహిళ క్రికెటర్లను విమర్శించిన మంజ్రేకర్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు నువ్వు ఏ స్టేజ్ లోనైనా క్రికెట్ ఆడావా? నాకు నువ్వు క్రికెట్ ఆడినట్లు గుర్తులేదు. నువ్వు కేవలం వ్యాఖ్యాతగా మాత్రమే తెలుసు అని ఒక అభిమాని విమర్శించగా, ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మహిళా క్రికెట్ ను పట్టించుకుని ఉంటే అప్పుడు విమర్శించినా ఫర్వాలేదు అని మరో అభిమాని మండిపడ్డాడు. వారు ఆడిను తీరును ఫైనల్ కు చేరిన తీరును అభినందించకుండా, ఎందుకు వర్రీ అవుతున్నావ్ అంటూ మరొకరు చురకలంటించారు. నువ్వు రిటైర్మెంట్ తీసుకున్నట్లయితే.. నీ వాగుడుకు మూత పడుతుంది'అని మరొక అభిమాని ఘాటుగా స్పందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement