సెమీస్‌లో సానియా జంట ఓటమి | Sania's pair lost in the semi-finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సానియా జంట ఓటమి

Oct 8 2017 1:33 AM | Updated on Oct 8 2017 5:46 AM

Sania's pair lost in the semi-finals

చైనా ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్‌)–షుయె పెంగ్‌ (చైనా) పోరాటం ముగిసింది. శనివారం బీజింగ్‌లో జరిగిన మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో సానియా–షుయె పెంగ్‌ ద్వయం 6–2, 1–6, 5–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో చాన్‌ యుంగ్‌ జాన్‌ (చైనీస్‌ తైపీ)–మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌) జంట చేతిలో ఓడిపోయింది.

76 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను నాలుగుసార్లు చొప్పున కోల్పోయాయి. అయితే నిర్ణాయక టైబ్రేక్‌లో హింగిస్‌ జంట పైచేయి సాధించింది. సెమీస్‌లో ఓడిన సానియా జంటకు 96,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 62 లక్షల 83 వేలు)తోపాటు 390 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement