సానియా ఖాతాలో మరో టైటిల్ | SANIA Sania wins 25th career doubles title with trophy in Miami | Sakshi
Sakshi News home page

సానియా ఖాతాలో మరో టైటిల్

Apr 6 2015 11:27 AM | Updated on Sep 2 2017 11:56 PM

సానియా ఖాతాలో మరో టైటిల్

సానియా ఖాతాలో మరో టైటిల్

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో మైలు రాయిని అధిగమించింది.

మియామి : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో  మైలు రాయిని అధిగమించింది.  మియామి ఓపెన్ టెన్నిస్ మహిళల డబుల్స్‌లో నెగ్గి  25వ టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్), టాప్‌సీడ్ సానియా జోడి మియామి ఓపెన్ టెన్నిస్ మహిళల డబుల్స్‌ ఫైనల్‌లో రష్యాకు చెందిన  సెకండ్ సీడెడ్ ఎకరీనా మకరోవా, ఎలీనా వెస్నినా జోడితో తలపడ్డారు.  ప్రారంభంలో వెనుకంజ వేసినప్పటికీ , తరువాత పుంజుకుని 7-5, 6-1తో  పాయింట్లతో  విజయం సాధించింది సానియా జోడీ.

రెండు వారాల క్రితం బీఎన్‌పీ పరిబాస్ ఓపెన్ ఫైనల్లోనూ మకరోవా-వెస్నినాపై గెలిచిన సానియా జోడీ టైటిల్ సాధించడం విశేషం.
 

Advertisement
 
Advertisement
Advertisement