నా చివరి శ్వాస ఉన్నంత వరకూ నీ వెన్నంటే

Sania Mirza Promises Son Izhaan Saying That She Will Be With Him Till Her Last Breath - Sakshi

'నా చివరి శ్వాస ఉన్నంత వరకూ నీ వెన్నంటే ఉంటా' అంటూ ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణీ, హైదారాబాదీ సానియా మీర్జా తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం తన కుమారుడు ఇజ్‌హాన్‌ మొదటి పుట్టినరోజు కావడంతో.. సానియా ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకుని సంవత్సరం క్రితం నాటి తన కుమారుని ఫోటోను జతచేశారు.
 

'నువ్వు ఈ ప్రపంచానికి వచ్చి, నా ప్రపంచంగా మారి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది. నీవు పుట్టినప్పుడు ఎలా చిరునవ్వు చిందించావో.. అలానే నువ్వు వెళ్లిన ప్రతిచోటా నవ్వులు పంచుతావని కోరుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా చివరి శ్వాస ఉన్నంత వరకూ నీ వెన్నంటే ఉంటానని నీకు వాగ్దానం ఇస్తున్నాను. నా చిన్ని తండ్రి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, నువ్వు కోరుకునే, చేసే ప్రతి పనిలో నీకు అల్లాహ్ దయ ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను. మమ్మల్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు ఇజాన్‌' అంటూ సుదీర్ఘ పోస్ట్‌ చేశారు. సానియా చేసిన పోస్టుకు స్పందించిన బాలీవుడ్‌ తారలు హుమా ఖురేషీ, నేహా ధూపియా ఇజ్‌హాన్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top