సానియా జంట ఓటమి | sania mirza loss the game | Sakshi
Sakshi News home page

సానియా జంట ఓటమి

Sep 30 2017 12:57 AM | Updated on Sep 30 2017 3:22 AM

sania mirza loss the game

న్యూఢిల్లీ: వుహాన్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమి యర్‌–5 టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్‌)–షుయె పెంగ్‌ (చైనా) జంట పోరాటం ముగిసింది. శుక్రవారం చైనాలో జరిగిన మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో సానియా–షుయె పెంగ్‌ ద్వయం 6–7 (5/7), 4–6తో మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌)–యుంగ్‌ జాన్‌ చాన్‌ (చైనీస్‌ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది. సెమీస్‌లో ఓడిన సానియా–షుయె పెంగ్‌ జోడీకి 34,880 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 22 లక్షల 79 వేలు) లభించింది. 

Advertisement
 
Advertisement
Advertisement