ఆమె భారత పౌరసత్వాన్ని రద్దు చేయండి.. సానియా మీర్జాపై నెటిజన్‌ల ఆగ్రహం

Sania Mirza Faces Backlash on Twitter For Supporting Pakistan in T20 World Cup 2021 Semifinal vs Australia - Sakshi

Sania Mirza Faces Backlash on Twitter For Supporting Pakistan:  టీ20 ప్రపంచకప్‌2021లో పాకిస్తాన్‌ పోరాటం​  ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో ఒక్క ఓటమి కూడా ఎరగని పాకిస్తాన్‌.. ఆస్ట్రేలియాతో గురువారం( నవంబర్‌11) జరిగిన రెండో సెమీఫైనల్లో అనుహ్యంగా ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని సపోర్ట్‌ చేయడానికి స్టేడియం వెళ్లిన సానియా మీర్జాపై నెటజన్లు మండిపడుతున్నారు. ఆమె భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేయాలని, అంతేగాక ఆమెపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం (ఉపా) కేసు పెట్టి దేశ పౌరసత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్  పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పుడు.. ఆసీస్ ఆటగాళ్ల వికెట్లు తీసినప్పుడు చప్పట్లు కొడుతూ మద్దతు పలికింది. కాగా..సానియా మీర్జా వివాదాలకు గురి కావటం..ట్రోలింగ్ కు గురి కావటం కూడా కొత్తేమీ కాదు. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోను షోయబ్ మాలిక్ సిక్సర్లు కొడుతుంటే..స్టాండ్స్‌లో కూర్చుని సానియా మీర్జా చప్పట్లు కొడుతూ కనిపించింది. అప్పుడు కూడా ఆమె ట్రోల్స్‌కు గురైంది. మరో వైపు పాక్‌ పేసర్‌ హసన్‌ అలీ భార్యని, ఆమె కుటుంబ సభ్యులను కూడా పాకిస్తాన్‌ అభిమానులు  ట్రోలింగ్‌ చేస్తున్నారు.

చదవండిఅత్యాచారం కేసులో హార్దిక్ పాండ్యా.. ? గ్యాంగ్‌స్టర్‌ భార్య సంచలన ఆరోపణలు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top