T20 WC 2021 Winner Australia: ఆటగాళ్ల సంబరం.. ఫొటోలు, వీడియోలు వైరల్.. ఓ లుక్కేయండి

T20 WC 2021 Winner Australia Celebrate Maiden T20 WC Triumph Photo Highlights: ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఏకంగా చాంపియన్‌గా అవతరించింది.
నవంబరు 14 నాటి ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి మొట్టమొదటి సారి టీ20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది.
తొలిసారి ఫైనల్‌కు చేరిన కివీస్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది.
టిమ్ సౌథీ బౌలింగ్‌లో మాక్స్‌వెల్ ఫోర్ కొట్టడంతో ఆస్ట్రేలియా విజయం ఖరారైంది.
ఇక ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా జట్టుగా ఆరోన్ ఫించ్ బృందం నిలిచింది.
దీంతో ఆసీస్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి.
ట్రోఫీని ముద్దాడుతూ.. షూలో డ్రింక్స్ తాగుతూ కంగారూలు తమ చిరస్మరణీయ విజయాన్ని ఆస్వాదించారు.
ఫైనల్ హీరోలు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌ను అభినందిస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి!
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)