
పాక్ క్రికెటర్లతో సానియా మీర్జా డ్యాన్స్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యులతో కలిసి డ్యాన్స్ చేసింది.
హైదరాబాద్: రతభా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యులతో కలిసి డ్యాన్స్ చేసింది. ఎందుకో తెలుసా... పాక్ క్రికెట్ టీమ్ విజయం సాధించినందుకట. ఆదివారం శ్రీలంకలో ఆ దేశ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ కూడా ఉన్నాడు.
దీంతో మ్యాచ్ చూసేందుకు వెళ్లిన సానియా మీర్జా సంతోషంతో ఎగిరి గంతేసింది. అంతేనా, భర్తతోపాటు పాక్ జట్టు సభ్యులతో కలిసి స్టెప్పులేసింది. ఈ వీడియోను షోయబ్ మాలిక్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. దీంతో సానియా వేసిన డబ్ స్మాష్ స్టెప్పులు ప్రస్తుతం నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
When bae comes to watch you play....Abhi Toh Party Shuru Hoi Hai With lots of love from @MirzaSania & I from Colombo pic.twitter.com/JreRtoxPDv
— Shoaib Malik (@realshoaibmalik) July 20, 2015