సానియా జంట జోరు | Sania Mirza enjoys perfect day at Australian Open | Sakshi
Sakshi News home page

సానియా జంట జోరు

Jan 24 2016 1:35 AM | Updated on Apr 3 2019 7:53 PM

సానియా జంట జోరు - Sakshi

సానియా జంట జోరు

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత స్టార్ సానియా మీర్జా జోరు కొనసాగుతోంది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి మహిళల డబుల్స్‌లో...

మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశం
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత స్టార్ సానియా మీర్జా జోరు కొనసాగుతోంది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి మహిళల డబుల్స్‌లో... ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో ఈ హైదరాబాద్ ప్లేయర్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో సానియా-హింగిస్ ద్వయం 6-2, 6-3తో లుద్మిలా-నాదియా కిచెంకో (ఉక్రెయిన్) జోడీపై గెలిచింది.

మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా-డోడిగ్ జంట 7-5, 6-1తో కిరియోస్-తొమ్లాజనోవిచ్ (ఆస్ట్రేలియా) ద్వయంపై నెగ్గింది. జూనియర్ బాలికల సింగిల్స్ తొలి రౌండ్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల 6-4, 5-7. 6-1తో మయూకా ఐకావా (జపాన్)పై నెగ్గి శుభారంభం చేసింది.

ముగురుజాకు షాక్: మహిళల సింగిల్స్ విభాగం మూడో రౌండ్‌లో రెండు సంచలనాలు నమోదయ్యాయి. మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్) 3-6, 2-6తో బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో; తొమ్మిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 3-6, 2-6తో 21వ సీడ్ మకరోవా (రష్యా) చేతిలో ఓడిపోయారు. ఏడో సీడ్ కెర్బర్ (జర్మనీ), 14వ సీడ్ అజరెంకా (బెలారస్), 15వ సీడ్ మాడిసన్ కీస్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.

వావ్రింకాకు 400వ విజయం
పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్),  రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మూడో రౌండ్‌లో వావ్రింకా 6-2, 6-3, 7-6 (7/3) తో  రసోల్ (చెక్ రిపబ్లిక్)పై నెగ్గాడు. వావ్రింకా కెరీర్‌లో ఇది 400వ విజయం. ముర్రే 6-2, 3-6, 6-2, 6-2తో సుసా (పోర్చుగల్)పై గెలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement