‘నా భార్య, కొడుకు ఇద్దరికి 16’ | On Sania Mirza Birthday Shoaib Malik Shares Heartwarming Photo | Sakshi
Sakshi News home page

Nov 16 2018 2:56 PM | Updated on Nov 16 2018 3:21 PM

On Sania Mirza Birthday Shoaib Malik Shares Heartwarming Photo - Sakshi

టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా పుట్టిన రోజు నేడు. ఆమె ఈరోజు 32వ వసంతంలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సానియా భర్త షోయబ్‌ మాలిక్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ ఫోటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. తన భార్య సానియా, ముద్దుల కుమారుడు ఇజహాన్‌తో కలసి ఉన్న ఫోటోను షేర్‌ చేశారు షోయబ్‌.

‘ఈ రోజుతో నా కుమారునికి 16 రోజులు.. నా భార్యకు 16 ఏళ్లు నిండాయి. నా అత్తగారికి’ కూడా అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ ఫోటో నెటిజన్లను ఫిదా చేస్తోంది. షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఫోటోకు వేల కొద్ది లైక్స్‌, కామెంట్స్‌ వస్తున్నాయి. కాగా ఈ ఏడాది అక్టోబర్‌ 30 న సానియా - షోయబ్‌లకు కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement