సాక్షి, అమరావతి: ఆసియా పారా గేమ్స్‌లో 3 పతకాలు సాధించిన రవి కార్తీక్ బుడిగినను వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. రవికార్తీక్ అద్భుతమైన ప్రతిభతో దేశానికి గర్వకారణంగా నిలిచాడు. పట్టుదల, కఠోర శ్రమ, పోరాట స్పూర్తితో యువతకు ఆదర్శంగా నిలిచాడని ప్రశంసించారు.
రవి కార్తీక్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రాష్ట్ర, దేశ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచాలని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రవికార్తీక్ జపాన్‌లో జరుగుతున్న పారాగేమ్స్‌లో స్విమ్మింగ్ విభాగంలో 2రజతాలు, ఒక కాంస్యం సాధించి సత్తా చాటారు.
ఇదీ చదవండి: బాబు సర్కార్ అష్టకుట్రలు
Heartiest congratulations to young para swimmer Ravi Karthik Budigina from Andhra Pradesh on winning two Silver medals and a Bronze medal at the Asian Para Games 2026 in Japan. Your remarkable achievements have brought immense pride to Andhra Pradesh and the entire nation. Your determination, hard work and fighting spirit are truly inspiring. Wishing you a very happy birthday and many more medals and successes in the years ahead. May you continue to make our state and country proud! #AsianParaGames2026 #Cheer4Bharat
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 23, 2026


