ఫైనల్లో సానియా జోడి | Sania Mirza-Barbora Strycova enter Sydney International final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సానియా జోడి

Jan 13 2017 12:08 AM | Updated on Sep 5 2017 1:06 AM

ఫైనల్లో సానియా జోడి

ఫైనల్లో సానియా జోడి

ఈ సీజన్‌లో వరుసగా రెండో టైటిల్‌కు సానియా మీర్జా మరో అడుగు దూరంలో నిలిచింది.

సిడ్నీ: ఈ సీజన్‌లో వరుసగా రెండో టైటిల్‌కు సానియా మీర్జా మరో అడుగు దూరంలో నిలిచింది. డబ్ల్యూటీఏ సిడ్నీ ఓపెన్‌లో టాప్‌సీడ్‌ సానియా–బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన డబుల్స్‌ సెమీఫైనల్లో సానియా–బార్బరా ద్వయం  6–1, 6–2 తేడాతో వానియా కింగ్‌ (అమెరికా)–యరోస్లావా ష్వెడోవా (కజకిస్తాన్‌) జోడీపై సునాయాసంగా నెగ్గింది. కేవలం 51 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో తమకు లభించిన ఐదు బ్రేక్‌ పాయింట్లను సానియా జోడీ కాపాడుకుని పైచేయి సాధించింది.

ఫైనల్లో వీరు టిమియా బబోస్‌–అనస్తేసియా పవ్లిచెంకోవా జంటతో ఆడనున్నారు. గతేడాది మార్టినా హింగిస్‌తో విడిపోయిన తర్వాత సానియా ఇతర భాగస్వాములతో ఆడిన 8 టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరడం ఇది ఆరోసారి. ఇప్పటికే స్ట్రికోవాతో కలిసి తను సిన్సినాటి, టోక్యో ఈవెంట్స్‌ను గెలుచుకుంది. 2014లో బెథానీ, 2015లో హింగిస్‌తో కలిసి సిడ్నీ ఓపెన్‌ గెలుచుకున్న సానియా, వరుసగా మూడో ఏడాది ఫైనల్లోకి ప్రవేశించడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement