యూఎస్ ఓపెన్ సెమీస్ లో సానియా-హింగిస్ | Sania-Hingis team reaches US Open semis | Sakshi
Sakshi News home page

యూఎస్ ఓపెన్ సెమీస్ లో సానియా-హింగిస్

Sep 9 2015 12:21 PM | Updated on Sep 3 2017 9:04 AM

యూఎస్ ఓపెన్ సెమీస్ లో సానియా-హింగిస్

యూఎస్ ఓపెన్ సెమీస్ లో సానియా-హింగిస్

భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా వరుసగా రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది.

న్యూయార్క్: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా వరుసగా రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది. మార్టినా హింగిస్ తో కలసి ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లో అడుగు పెట్టింది.

క్వార్టర్ ఫైనల్లో తైపీకి యంగ్ జాన్ చాన్-చింగ్ చాన్ జోడిపై 7-6(5) 6-1 తేడాతో ఓడించారు. 85 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో సానియా-హింగిస్ నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించారు. సెమీఫైనల్లో ఇటాలీకి చెందిన సారా ఎరానీ- ఫ్లవియా పెనెట్టా జోడితో వీరిద్దరూ తలపడతారు.

Advertisement
 
Advertisement
Advertisement