టీమిండియాపై కరాన్‌ కొత్త రికార్డు

Sam Curran creates new record against india - Sakshi

సౌతాంప్టన్‌: టీమిండియా-ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మరో కొత్త రికార్డు నమోదైంది. ఇంగ్లండ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరాన్‌ అరుదైన రికార్డును లిఖించాడు. భారత్‌పై ఒక టెస్టు సిరీస్‌లో ఎనిమిది, అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కరాన్‌ కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఈ సిరీస్‌లో కరాన్‌ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఇప్పటివరకూ చేసిన పరుగులు 242. దాంతో టీమిండియాపై అత్యధిక పరుగులు చేసిన రికార్డును నెలకొల్పాడు.

తద్వారా  న్యూజిలాండ్‌ ఆటగాడు డేనియల్‌ వెటోరి నెలకొల్పిన రికార్డును బద్ధలు కొట్టాడు. 2009లో భారత్‌తో జరిగిన సిరీస్‌లో వెటోరి ఎనిమిది, అంతకంటే కింది స్థానంలో బ్యాటింగ్‌ చేసి 220 పరుగులు చేశాడు. ఇదే ఈ స్థానంలో ఇప్పటివరకూ అత్యధికంగా కాగా, దాన్ని కరాన్‌ సవరించాడు. భారత్‌పై టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కరాన్‌ 24 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 63 పరుగులు చేశాడు. ఇక రెండో టెస్టులో కరాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేశాడు. నాల్గో టెస్టులో కరాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 37 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.

ఇంగ్లండ్‌ పోరాటం

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top