లైన్ కాల్స్‌పై సైనా అసంతృప్తి | Saina Nehwal unhappy with line calls | Sakshi
Sakshi News home page

లైన్ కాల్స్‌పై సైనా అసంతృప్తి

Aug 20 2013 11:36 PM | Updated on Sep 1 2017 9:56 PM

లైన్ కాల్స్‌పై సైనా అసంతృప్తి

లైన్ కాల్స్‌పై సైనా అసంతృప్తి

ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో అంపైర్ల పనితీరుపై భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. లైన్‌కాల్స్ కారణంగా తాను పాయింట్లు కోల్పోయినట్లు ఆమె చెప్పింది.

 ముంబై: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో అంపైర్ల పనితీరుపై భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. లైన్‌కాల్స్ కారణంగా తాను పాయింట్లు కోల్పోయినట్లు ఆమె చెప్పింది. ‘పుణేతో మ్యాచ్‌లో షెంక్‌తో రెండో గేమ్‌లో చాలా పాయింట్లు నాకు ప్రతికూలంగా వచ్చాయని భావిస్తున్నాను. ముఖ్యంగా లైన్ కాల్స్ విషయంలో తప్పు జరిగింది. ఇలాంటివి ఐదు, ఆరు పాయింట్ల వరకు ఉన్నాయి. అంపైర్లు వారి పరిధిలో ఎలా విధులు నిర్వహించినా నేను మాత్రం అసంతృప్తి చెందాను. అయితే చివరకు మ్యాచ్ గెలవడం మాత్రం మంచి పరిణామం’ అని సైనా వ్యాఖ్యానించింది.
 
 అనేక నిర్ణయాలు తనకు వ్యతిరేకంగా వెళ్లడం వల్ల కూడా మ్యాచ్‌లో కొన్ని సార్లు తను సంయమనాన్ని కోల్పోయినట్లు ఈ హాట్‌షాట్ ప్లేయర్ పేర్కొంది. అదే కారణంగా రెండో గేమ్‌లో అదుపు కోల్పోయి దూకుడుగా వ్యవహరించినట్లు సైనా వెల్లడించింది. తౌఫీక్ హిదాయత్ సూచనలు తనకూ, అజయ్ జయరామ్‌కు ఎంతో ఉపకరించాయన్న భారత నంబర్ వన్ షట్లర్... ఐబీఎల్ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement