మళ్లీ ఆమె వరల్డ్ నంబర్ వన్! | Saina Nehwal regains World No.1 spot | Sakshi
Sakshi News home page

మళ్లీ ఆమె వరల్డ్ నంబర్ వన్!

Aug 20 2015 1:37 PM | Updated on Sep 3 2017 7:48 AM

మళ్లీ ఆమె వరల్డ్ నంబర్ వన్!

మళ్లీ ఆమె వరల్డ్ నంబర్ వన్!

వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో రజత పతకం గెలిచిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మరోసారి ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది.

న్యూఢిల్లీ: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో రజత పతకం గెలిచిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మరోసారి ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన తాజా ర్యాకింగ్స్ లో ఆమె అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 25 ఏళ్ల సైనా నెహ్వాల్ మహిళ సింగిల్స్ విభాగంగా మొదటి ర్యాంకులో నిలిచింది.

వరల్డ్ చాంపియన్ షిప్ ఫైనల్లో సైనాను ఓడించిన స్సెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ రెండో స్థానానికి పడిపోయింది. చైనా క్రీడాకారిణి జు యింగ్ 3వ ర్యాంకులో ఉంది. వరల్డ్ చాంపియన్ షిప్ లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయిన పీవీ సింధు 14వ స్థానానికి పడిపోయింది.

పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్ 4వ ర్యాంకుకు దిగజారాడు. పారుపల్లి కశ్యప్ రెండు స్థానాలు ఎగబాకి 8వ ర్యాంకు దక్కించుకున్నాడు. మహిళల డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జోడీ కెరీర్ లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. వీరిద్దరూ 10వ ర్యాంకులో నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement