అవకాశం ఉంటే సిఫారసు చేస్తాం | Saina Nehwal May Be Recommended for Padma Bhushan Award: Sarbananda Sonowal to NDTV | Sakshi
Sakshi News home page

అవకాశం ఉంటే సిఫారసు చేస్తాం

Jan 5 2015 1:06 AM | Updated on Sep 2 2017 7:13 PM

అవకాశం ఉంటే సిఫారసు చేస్తాం

అవకాశం ఉంటే సిఫారసు చేస్తాం

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ అవార్డు కోసం చేసుకున్న దరఖాస్తు తమకు శనివారమే అందిందని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్...

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ అవార్డు కోసం చేసుకున్న దరఖాస్తు తమకు శనివారమే అందిందని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ స్పష్టం చేశారు. ఈ పురస్కారం కోసం సైనా పేరును పంపే అవకాశాలు ఏమైనా ఉన్నాయో లేదో సోమవారం పరిశీలిస్తానన్నా రు. ‘సైనా చేసిన ఆరోపణలను మీడియాలో చూశా. ఈనెల 3కు ముందు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నుంచి మా శాఖకు ఎలాంటి దరఖాస్తు అం దలేదు.

2014 ఆగస్టు 9వ తేదీతో ఉన్న ‘బాయ్’ లేఖ ఈనెల 3న మాకు అందింది. అందులో సైనా పేరును అవార్డుకు ప్రతిపాదించినట్లు ఉంది. దీన్ని అధికారులు మా ఇంటి దగ్గర నాకు చూపించారు. ఈ అంశాలన్నింటినీ పక్కనబెడితే సైనా పేరును హోంశాఖకు పంపేం దుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయో లేదో వివరంగా పరిశీలిస్తాం’ అని సోనోవాల్ వివరించారు.

రెండోసారి పద్మ అవార్డును స్వీకరించేందుకు ఐదు సంవత్సరాల విరామం ఉండాలన్న నిబంధనను కూడా తాను పరి శీలిస్తానని సోనోవాల్ హామీ ఇచ్చారు. మరోవైపు సైనా దరఖాస్తును ఆగస్టులోనే పంపామని ‘బాయ్’ అధ్యక్షుడు అఖిలేశ్ దాస్‌గుప్తా పునరుద్ఘాటించారు. మం త్రిత్వశాఖ నుంచి రసీదు కూడా తమకు వచ్చిందని... ఇందులో గందరగోళానికి తావు లేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement