కాశీలో ప్రారంభం
వారాణసి: స్వచ్ఛ ఇంధన వాడకాన్ని ప్రోత్సహించే దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. దేశంలో తొలిసారిగా హైడ్రోజన్ సాయంతో వాణిజ్యపరమైన నా వికా సేవలకు తెర తీసింది. వారణాసిలోని నమో ఘాట్ ఇందుకు వేదికైంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నావను కేంద్ర జల వనరులు, నౌకాయాన మంత్రి శర్బానంద్ సోనోవాల్ గురువారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయేతర, దీర్ఘకాలిక ఇంధన వాడకాన్ని ప్రోత్సహించే దిశగా భారత చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
‘మన మిప్పుడు హైడ్రో ఇంధనాన్ని వాడుతున్న చైనా, నార్వే, నెదర్లాండ్స్, జపాన్ వంటి అతి కొద్ది దేశాల సరసన సగర్వంగా నిలిచాం. ఇది కేవలం సాంకేతిక ప్రగతి మా త్రమే కాదు. స్వచ్ఛ ఇంధనం, దాని వాడకం నిమిత్తం దేశీయ మార్గాల రూపకల్పన దిశగా మనం వడివడిగా వేస్తున్న ముందడుగు తిరుగులేని సూచిక. అంతర్గత జల మార్గాలు దేశాభివృద్ధిలో కీ పాత్ర పోషించే స్థాయికి ఎదుగుతున్నాయి. జాతీయ జల మార్గాల సంఖ్య గడచిన పదేళ్లలో సంఖ్య 5 నుంచి ఏకంగా 111కు పెరిగింది! వాటిలో 13 జల మార్గాల్లో పర్యాటకం నానాటికీ ఇతోధికంగా పెరిగిపోతోంది. ఇదెంతో శుభసూచకం. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ వల్లే ఇది సాధ్యపడింది‘ అన్నారు. హైడ్రో ఇంధన సేవలను పూర్తిస్థాయిలో వినియోగించాలంటే మరిన్ని పరిశోధనలు, కీలక పరీక్షలు చేయాల్సి ఉంది.


