సైనా జోరుగా ముందుకు.. | Saina Nehwal enters into Malaysia Masters semis | Sakshi
Sakshi News home page

సైనా జోరుగా ముందుకు..

Jan 20 2017 7:22 PM | Updated on Sep 5 2017 1:42 AM

సైనా జోరుగా ముందుకు..

సైనా జోరుగా ముందుకు..

మలేసియా మాస్టర్స్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్‌ సైనా నెహ్వాల్ మరో విజయం సాధించింది.

సారావక్‌ (మలేసియా): మలేసియా మాస్టర్స్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్‌ సైనా నెహ్వాల్ మరో విజయం సాధించింది. వరుసగా మూడో విజయంతో సైనా నెహ్వాల్‌ సెమిఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సైనా 21-15, 21-14 తేడాతో ఇండోనేసియాకు చెందిన ఫిత్రియానిని ఓడించింది. వరుస పాయింట్లు సాధిస్తూ ఎనిమిదో సీడెడ్‌ ప్లేయర్ ఫిత్రియానిని తికమక పెట్టి తొలి సెట్ కైవసం చేసుకున్న టాప్ సీడ్ సైనా రెండో సెట్‌లోనూ పోరాటం కొనసాగించింది. 40 నిమిషాల్లో గేమ్ ముగించి సైనా సెమిస్‌లో ప్రవేశించింది.

మరోవైపు పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఆరో సీడ్‌ అజయ్‌ జయరామ్‌ కూడా క్వార్టర్‌ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. క్వార్టర్స్ మ్యాచ్‌లో ఆంథోనీ సినిసుకా గింటింగ్ (ఇండోనేసియా) చేతిలో 21-13, 21-8 తేడాతో జయరామ్ ఓటమిపాలయ్యాడు. రెండు వరుస సెట్లలో జయరామ్ చేతులెత్తేయడంతో ప్రత్యర్థి ఆంథోనీ కేవలం 28 నిమిషాల్లోనే నెగ్గి సెమిఫైనల్స్ చేరుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement