క్వార్టర్‌ ఫైనల్లో సైనా | Saina Nehwal, Ajay Jayaram storm into quarter-finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో సైనా

Jan 20 2017 1:27 AM | Updated on Sep 5 2017 1:37 AM

క్వార్టర్‌ ఫైనల్లో సైనా

క్వార్టర్‌ ఫైనల్లో సైనా

వరుసగా రెండో విజయం సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్‌ సైనా నెహ్వాల్‌... మలేసియా మాస్టర్స్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

సారావక్‌ (మలేసియా): వరుసగా రెండో విజయం సాధించిన భారత బ్యాడ్మింటన్  స్టార్‌ సైనా నెహ్వాల్‌... మలేసియా మాస్టర్స్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సైనా 21–17, 21–12తో హనా రమాదిని (ఇండోనేసియా)పై గెలిచింది. శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ఎనిమిదో సీడ్‌ ఫిత్రియాని (ఇండోనేసియా)తో సైనా ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఆరో సీడ్‌ అజయ్‌ జయరామ్‌ కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టాడు.

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జయరామ్‌ 21–12, 15–21, 21–15తో సుయె సువాన్  యి (చైనీస్‌ తైపీ)పై గెలుపొందాడు. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సుమిత్‌ రెడ్డి–మనూ అత్రి (భారత్‌) ద్వయం 17–21, 21–18, 12–21తో గుణవా¯ŒS–కిడో (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో గుత్తా జ్వాల–మనూ అత్రి జోడీ 18–21, 10–21తో అహ్మద్‌–గ్లోరియా (ఇండోనేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది.

Advertisement
 
Advertisement
Advertisement