ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి సైనా నిష్క్రమణ | Saina loses to Shixian in Australian Open quarters | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి సైనా నిష్క్రమణ

May 29 2015 3:58 PM | Updated on Sep 3 2017 2:54 AM

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్ వన్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్ర్కమించింది.

సిడ్నీ:  భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్ వన్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్ర్కమించింది.  శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 15-21, 13-21తేడాతో ఐదోసీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓటమి పాలైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సైనా ఏ దశలోనూ ఆకట్టులేకపోయింది. తొలి గేమ్ లో ఐదు పాయింట్లు వరకూ నువ్వా-నేనా అన్నట్లు సైనా తలపడినా.. ఆ తరువాత మాత్రం పేలవమైన ఆటను ప్రదర్శించింది.

 

వరుస సెట్లను చేజార్చుకుని ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి భారంగా వైదొలిగింది. మాజీ వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి షిజియాన్ కేవలం 42 నిమిషాల్లోని సైనా ఆటకట్టించింది.

Advertisement
 
Advertisement
Advertisement