సాయి ఉత్తేజిత, జయరామ్‌ ఓటమి | Sai UtteJita And Ajay Jayaram Loses Macau Badminton Tournament | Sakshi
Sakshi News home page

సాయి ఉత్తేజిత, జయరామ్‌ ఓటమి

Oct 31 2019 4:55 AM | Updated on Oct 31 2019 4:55 AM

Sai UtteJita And Ajay Jayaram Loses Macau Badminton Tournament - Sakshi

న్యూఢిల్లీ: మకావు ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌ ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు, పురుషుల సింగిల్స్‌లో అజయ్‌ జయరామ్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. మకావులో బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో సాయి ఉత్తేజిత 19–21, 12–21తో ఆరో సీడ్‌ కాయ్‌ యాన్‌ యాన్‌ (చైనా) చేతిలో... జయరామ్‌ 16–21, 16–21తో సన్‌ ఫె జియాంగ్‌ (చైనా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో జక్కంపూడి మేఘన–పూరీ్వషా రామ్‌ (భారత్‌) జోడీ 17–21, 19–21తో లిన్‌ ఫాంగ్‌ లింగ్‌–జిన్‌ రు జౌ (చైనా) జంట చేతిలో... పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో వసంత కుమార్‌ హనుమయ్య–ఆశిత్‌ సూర్య (భారత్‌) ద్వయం 14–21, 14–21తో లిన్‌ చియా యు–యాంగ్‌ మింగ్‌ త్సె (చైనీస్‌ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయాయి.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement