రన్నరప్‌ సాయికార్తీక్‌ | Sai Karthik settles as runner up | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ సాయికార్తీక్‌

Jul 30 2018 10:10 AM | Updated on Jul 30 2018 10:10 AM

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జూనియర్స్‌ టోర్నమెంట్‌లో గంటా సాయికార్తీక్‌ రెడ్డి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జోర్డాన్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో సాయికార్తీక్‌ సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో రన్నరప్‌గా నిలిచాడు.

బాలుర సింగిల్స్‌ ఫైనల్లో సాయికార్తీక్‌ 3–6, 4–6తో అబెదల్లా షెల్‌బే (జోర్డాన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో సాయికార్తీక్‌ 6–2, 7–5తో ప్రసన్న ప్రవీణ్‌ (భారత్‌)పై గెలిచాడు. డబుల్స్‌ ఫైనల్లో అమెరికాకు చెందిన అర్జున్‌ మరియప్పతో జత కట్టిన సాయికార్తీక్‌ 2–6, 6–7తో అలెక్స్‌ జియాంగ్‌ (కెనడా)– కెవిన్‌ పటేల్‌ (భారత్‌) చేతిలో ఓటమి పాలయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement