'సచిన్ వికెట్ శబ్దం అత్యంత ఇష్టం'

Sachin's wicket of My ball hitting is the best sound,says Brett Lee

తిరువనంతపురం:భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బౌల్డ్ అయ్యే క్రమంలో వచ్చే ఆ శబ్దం అంటే తనకు అత్యంత ఇష్టమని ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ స్పష్టం చేశాడు. తామిద్దరం కలిసి క్రికెట్ ఆడిన రోజుల్లో సచిన్ బౌల్డ్ అయిన వెంటనే వచ్చిన శబ్దాన్ని ఎక్కువగా ఆస్వాదించేవాడినన్నాడు. 'మైదానంలో అంపైర్ నోటి వెంట నో బాల్ అని వస్తే చిరుగ్గా ఉండేది. అస్సలు నోబాల్ అనడాన్ని ఇష్టపడేవాడిని కాదు. సచిన్ కు బౌలింగ్ చేస్తుండగా.. నేను వేసిన బంతి అతని వికెట్లను తాకితే వచ్చే సౌండ్ అంటే నాకు చాలా ఇష్టం'అని బ్రెట్ లీ పేర్కొన్నాడు.

గత రెండు రోజుల క్రితం వినికిడి లోపం పిల్లల కోసం కేరళ ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బ్రెట్ లీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన బ్రెట్ లీ.. పిల్లల్ని ఉత్సాహపరిచేలా మాట్లాడాడు. 2008లో క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు చెప్పిన బ్రెట్ లీ.. 221 వన్డేల్లో 380 వికెట్లు, 76టెస్టుల్లో 310 వికెట్లు సాధించాడు.

Back to Top