సచిన్ రికార్డు టెస్టుకు ఘనమైన ఏర్పాట్లు | sachin tendulkar for test record arrangeing very hugely | Sakshi
Sakshi News home page

సచిన్ రికార్డు టెస్టుకు ఘనమైన ఏర్పాట్లు

Aug 24 2013 1:25 AM | Updated on Sep 1 2017 10:03 PM

సచిన్ రికార్డు టెస్టుకు ఘనమైన ఏర్పాట్లు

సచిన్ రికార్డు టెస్టుకు ఘనమైన ఏర్పాట్లు

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆడే 200వ టెస్టుకు ఘనమైన ఏర్పాట్లు చేస్తామని క్రికెట్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు క్రిస్ నెంజానీ తెలిపారు.

 జొహన్నెస్‌బర్గ్: మాస్టర్ బ్లాస్ట ర్ సచిన్ టెండూల్కర్ ఆడే 200వ టెస్టుకు ఘనమైన ఏర్పాట్లు చేస్తామని క్రికెట్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు క్రిస్ నెంజానీ తెలిపారు. ఈ ఏడాది చివర్లో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఆడే రెండో టెస్టుతో మాస్టర్ 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంటాడు. ‘ప్రపంచ క్రికెట్‌లోనే 200 టెస్టులు ఆడటం అరుదైన ఘనత.
 
 దీనిని చేరుకుం టున్న దిగ్గజ క్రికెటర్‌ను మేం ఘనంగా గౌరవిస్తాం. ఆ మ్యాచ్ కోసం చేయాల్సిన ఏర్పాట్ల గురించి ఇప్పటికే మాకు స్పష్టత ఉంది. దీనిపై బీసీసీఐతో పాటు భారత టీమ్ మేనేజ్‌మెంట్‌తోనూ చర్చించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం’ అని క్రిస్ చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement