ఐసీసీ.. ఇది ఓ ప్రశ్నేనా? | Sachin Tendulkar Fans Fires On ICC | Sakshi
Sakshi News home page

ఐసీసీ.. ఇది ఓ ప్రశ్నేనా?

Jul 19 2019 8:33 PM | Updated on Jul 19 2019 8:59 PM

Sachin Tendulkar Fans Fires On ICC - Sakshi

సచిన్‌ సృష్టించిన విధ్వంస, రికార్డులు కనబడటం లేదా?

న్యూఢిల్లీ : అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు స్థానం లభించిన విషయం తెలిసిందే. సచిన్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ అలెన్‌ డొనాల్డ్‌, ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్‌ ఫిట్జ్‌పాట్రిక్‌లకు సైతం ఈ అరుదైన గౌరవం దక్కింది. అయితే ఈ సందర్భంగా ఐసీసీ చేసిన ట్వీట్‌పై సచిన్‌ అభిమానులను మండిపడుతున్నారు. ఈ ట్వీట్‌లో ‘లిటిల్‌ మాస్టర్‌కు ఐసీసీ హాల్‌ఆఫ్‌ ఫేమ్‌లో చోటుదక్కింది... అయితే ఈయన ఆల్‌టైం గొప్ప క్రికెటరా?’ అని ప్రశ్నించింది. ఇది సచిన్‌ అభిమానులకే కాదు.. క్రికెట్‌ అభిమానుందరిని ఆగ్రహానికి గురిచేసింది.

‘100 సెంచరీలతో క్రికెట్‌లో మేటి బౌలర్లైన వసీం, వకార్‌, మెక్‌గ్రాత్‌, బ్రెట్‌లీ, అక్తర్‌, షేన్‌వార్న్‌, మురళి, వాస్‌, షేన్‌​ బాండ్‌, వెటోరి, వాల్ష్‌, అంబ్రోస్‌, సక్లేన్‌, ఫ్లింటాఫ్‌, అలెన్‌ డోనాల్డ్‌, పోలాక్‌ వంటి దిగ్గజ బౌలర్లందరినీ ఆటాడుకున్న విషయం తెలియదా? లేక సచిన్‌ సృష్టించిన విధ్వంసం, రికార్డులు కనబడటం లేదా?’ అని మండిపడుతున్నారు. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగడం మానేయాలని చురకలింటిస్తున్నారు. ఐసీసీ ఔనన్నా కాదన్నా సచిన్‌ ఎప్పటికి గొప్ప ఆటగాడేనని కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement