'అదే అర్జున్ టెండూల్కర్ ఎంపికకు కారణం' | Sachin Tendulkar’s son Arjun set to debut for Mumbai Under-19 | Sakshi
Sakshi News home page

'అదే అర్జున్ టెండూల్కర్ ఎంపికకు కారణం'

Oct 6 2017 2:24 PM | Updated on Oct 6 2017 9:00 PM

Sachin Tendulkar’s son Arjun set to debut for Mumbai Under-19

ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబయి అండర్ 19 జట్టులో ఆడేందుకు రంగం సిద్ధమైంది. తాజాగా ముంబై ఆడే తొలి రెండు మ్యాచ్ లకు గాను జట్టును రాజేశ్ పవార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అందులో అర్జున్ టెండూల్కర్ పేరును ఖరారు చేస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ముంబై అండర్-19 జట్టుకు అగ్ని చోప్రాను కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

ఇదిలా ఉంచితే, అర్జున్ టెండూల్కర్ జట్టులో చోటివ్వడంపై రాజేశ్ పవార్ స్పందించారు. గత కొంతకాలంగా అర్జున్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ముంబైలో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో అర్జున్ ఆకట్టుకున్నాడు. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ అర్జున్ సత్తాచాటాడు. అతన్ని బౌలింగ్ ఆల్ రౌండర్ గా పరిగణించే అండర్ 19 జట్టులో ఎంపిక చేశాం'అని రాజేశ్ పవార్ తెలిపారు.  2015-16 సీజన్ లో ముంబై అండర్ 16 జట్టుకు అర్జున్ ప్రాతినిథ్యం వహించాడు. మరొకవైపు గతేడాది 'బి' డివిజన్ క్రికెట్ టోర్నీల్లో కూడా అర్జున్ పాల్గొన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ కు వెళ్లిన అర్జున్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో శిక్షణ పొందాడు.

Advertisement
 
Advertisement
Advertisement