ధావన్‌ నిష్క్రమణ‌.. సచిన్‌ ఎమోషనల్‌ | Sachin Says Feel For You Shikhar Dhawan | Sakshi
Sakshi News home page

ధావన్‌ ఔట్‌.. సచిన్‌ ఎమోషనల్‌

Jun 20 2019 6:42 PM | Updated on Jun 20 2019 6:55 PM

Sachin Says Feel For You Shikhar Dhawan - Sakshi

సౌతాంప్టన్‌ : బొటనవేలికి గాయం కారణంగా టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌ ప్రపంచకప్‌ టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఐసీసీ వంటి మెగా టోర్నీకి దూరంకావడంపై ధావన్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. గాయం నుంచి కోలుకొని దేశం తరుపున ప్రపంచకప్‌లో ఆడాలని బలంగా కోరుకున్నానని కాని విధి మరొకటి తలచిందని ఎమోషనల్‌ అయ్యాడు. అయితే ధావన్‌ ప్రపంచకప్‌ టోర్నీ నుంచి దూరమవడం పట్ల పలువురు క్రికెటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా లెజండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ధావన్‌ దూరం కావడంపై ట్విటర్‌లో స్పందించాడు. 

‘గాయం నుంచి త్వరగా కోలుకొని తిరిగి టీమిండియాలోకి వస్తావు అనుకున్నా. కానీ గాయం కారణంగా ప్రపంచకప్‌ నుంచి నువ్వు నిష్క్రమించావన్న వార్త విని నా మనసు ముక్కలయింది. నువ్వు ప్రపంచకప్‌లో లేకపోవటం నాకు ఎంతో బాధను కలిగిస్తోంది. కాని గాయం నుంచి త్వరగా కోలుకొని ఇప్పటికంటే ఎంతో బలమైన ఆటగాడిగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నా. రిషభ్‌ పంత్‌ నీకు మంచి అవకాశం వచ్చింది. వినియోగించుకో. ప్రపంచకప్‌ వంటి మెగా ప్లాట్‌ఫాంపై నువ్వు నిరూపించుకో. గుడ్‌ లక్‌’అంటూ సచిన్‌ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement