చెలరేగిన సచిన్, గంగూలీ | sachin, ganguly hits half centuries in All Stars T20 | Sakshi
Sakshi News home page

చెలరేగిన సచిన్, గంగూలీ

Nov 15 2015 9:45 AM | Updated on Sep 3 2017 12:32 PM

చెలరేగిన సచిన్, గంగూలీ

చెలరేగిన సచిన్, గంగూలీ

ఆల్ స్టార్ టి20 క్రికెట్ సిరీస్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ చెలరేగారు.

లాస్ ఏంజెలెస్: ఆల్ స్టార్ టి20 క్రికెట్ సిరీస్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ చెలరేగారు. వార్న్ వారియర్స్ తో జరుగుతున్న మూడో మ్యాచ్ లో అర్ధసెంచరీలతో జట్టుకు భారీ స్కోరు అందించారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సచిన్ బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. వారియర్స్ కు 220 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

సచిన్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు సాధించాడు. గంగూలీ 37 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. సెహ్వాగ్ 27, జయవర్ధనే 41, హూపర్ 33 పరుగులు సాధించారు. వారియర్స్ బౌలర్లలో వెటోరి 3 వికెట్లు పడగొట్టాడు. సైమండ్స్, వాల్ష్ చెరో వికెట్ దక్కించుకున్నారు.  మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ ల్లో వారియర్స్ గెలిచింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement