భారీ స్కోరు దిశగా దక్షిణాఫ్రికా | SA scores 209 for 2 wickets | Sakshi
Sakshi News home page

భారీ స్కోరు దిశగా దక్షిణాఫ్రికా

Oct 25 2015 3:55 PM | Updated on Sep 3 2017 11:28 AM

భారీ స్కోరు దిశగా దక్షిణాఫ్రికా

భారీ స్కోరు దిశగా దక్షిణాఫ్రికా

భారత్- దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న ఫైనల్ వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.

ముంబై: భారత్- దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న ఫైనల్ వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలుత ఓపెనర్ గా బరిలోకి దిగిన ఆమ్లా(23) అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన డుప్లెసిస్, ఓపెనర్ డికాక్లు ధాటిగా ఆడి దక్షిణాఫ్రికా స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో 87 బంతుల్లోనే డికాక్ 109 పరుగులు చేసి రెండో వికెట్ గా వెనుదిరిగాడు.
 

35 ఓవర్లు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 240 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. డుప్లెసిస్(77), డివిలియర్స్(26) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement