oneday
-
అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించిన హీరో మోటోకార్ప్..!
ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. ఒకేరోజు (ఆగస్టు 9) ఏకంగా లక్ష యూనిట్ల బైక్‌లను రిటైల్ అమ్మకాలను జరిపింది. ఈ అరుదైన రికార్డు హీరో మోటోకార్ప్ కంపెనీ పదవ వార్షికోత్సవం జరగడం విశేషం. పండుగ సీజన్ లేని సమయంలో భారత్‌తో పాటు ఇతర దేశాల్లో హీరో బైక్‌లు రికార్డుస్థాయిలో రిటైల్ అమ్మకాలు జరిగినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన హీరో మోటార్స్ అమ్మకాల్లో ఎంట్రీ, డీలక్స్, ప్రీమియం బైక్‌ల సెగ్మెంట్లకు వీపరీతమైన డిమాండ్ కారణంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని కంపెనీ వెల్లడించింది. హీరో మోటోకార్ప్ కొత్తగా ప్రారంభించిన మాస్ట్రో ఎడ్జ్ 125, డెస్టినీ, ప్లెజర్ 110 తో సహా, తన స్కూటర్ల శ్రేణికి విపరీతమైన డిమాండ్‌తో ఆగస్టు 9న జరిగిన స్కూటర్ల అమ్మకాల్లో రోజువారీ సగటు కంటే రెట్టింపు అమ్మకాలు జరిగాయని కంపెనీ పేర్కొంది. ఈ వాహనాలతో పాటుగా ఇటీవల ప్రారంభించిన గ్లామర్ ఎక్స్‌టెక్, స్ప్లెండర్ మాట్టే గోల్డ్, ఎక్స్ట్రీమ్ 160ఆర్ బైక్‌లను కూడా కస్టమర్లు గణనీయంగా కొనుగోలు చేశారని హీరో మోటోకార్ప్ తెలిపింది. హీరో మోటోకార్ఫ్ 10 సంవత్సరాల ప్రయాణంలో ఈ అమ్మకాలు ఒక మైలురాయిగా నిలుస్తోందని హీరో మోటోకార్ప్ సేల్స్ & ఆఫ్-సేల్స్ హెడ్ నవీన్ చౌహాన్ అన్నారు. పండుగ సీజన్ లేని కాలంలో రికార్డు స్థాయిలో లక్ష హీరో బైక్‌ల రిటైల్ అమ్మకాలు జరిపిన కస్టమర్లకు అభినందనలను అందించారు. కస్టమర్లు తమపై చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలను తెలిపారు. -
భారత్‌తో తొలి వన్డే; న్యూజిలాండ్ ఫీల్డింగ్
హామిల్టన్: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ స్థానంలో మయాంక్ అగర్వాల్ జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ కాలిపిక్క కండరాలు పట్టేయడంతో ఆ తర్వాత ఫీల్డింగ్‌కు రాలేదు. ఆపై రోహిత్‌ను బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉంచగా, అతనికి కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని ఫిజియో సూచించారు. దాంతో మొత్తం న్యూజిలాండ్ పర్యటన నుంచి రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఆ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. న్యూజిలాండ్‘ఎ’తో సిరీస్‌లో భాగంగా అక్కడే ఉన్న మయాంక్‌కు సీనియర్ జట్టులో అవకాశం కల్పించారు. ఈ స్థానం కోసం శుబ్‌మన్ గిల్ పోటీపడినప్పటికీ మయాంక్‌కే మేనేజ్మెంట్ మొగ్గుచూపింది. ఓపెనర్లుగా పృథ్వీషా, మయాంక్ అగర్వాల్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. వీరిద్దరికీ ఇది అరంగేట్రపు వన్డే. ‘పొట్టి ఫార్మాట్’లో అద్భుత ప్రదర్శన తర్వాత కోహ్లి సేన ఆత్మవిశ్వాసం అంబరాన్ని చుంబిస్తుండగా, అటు న్యూజిలాండ్ టి20 గాయాలను మరచి కొత్తగా ఆటను మొదలు పెట్టాలని భావిస్తోంది. భారత్ సొంతగడ్డపై ఇటీవలే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో విజయం సాధించగా... న్యూజిలాండ్‌కు ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ‘బౌండరీ పరాజయం’ తర్వాత ఇదే తొలి వన్డే కావడం విశేషం. -
విండీస్‌పై భారత్ ఘనవిజయం
► రహానే అజయ శతకం ► రాణించిన కోహ్లీ, ధావన్ ► ఆకట్టుకున్న కుల్ధీప్, భువీ పోర్ట్ ఆఫ్ స్పెయిన్: కరీబియన్ పర్యటనలో భారత్ బోణి కొట్టింది. ఏకంగా 105 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఓపెనర్ అజింక్యా రహానే శతకంతో చెలరేగగా, ధావన్, కోహ్లీ అర్ధ సెంచరీలతో రాణించారు. ఇక యువ బౌలర్ కుల్ధీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ విండీస్‌పై సునాయసంగా విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి శుభారంబాన్ని అందించారు. తొలి వన్డేలో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న రహానే ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో శతకం (104 బంతుల్లో 103; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) బాదాడు. అతడికి తోడు కెప్టెన్ కోహ్లి (66 బంతుల్లో 87; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శిఖర్ ధావన్ (59 బంతుల్లో 63; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించగా భారత్ 43 ఓవర్లలో ఐదు వికెట్లకు 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. జోసెఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. భారీ లక్ష్య చేదనకు దిగిన విండీస్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ పోవెల్ భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే డకౌటయ్యాడు. ఆ తర్వత క్రీజులోకి వచ్చిన మహ్మద్‌ను కూడా భువీ డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్ షై హోప్(89) ఒంటిరి పోరాటం చేయగా మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహాకారం అందకపోవడంతో నిర్ణీత 43 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఇక భారత్ బౌలర్లలో భువీ 2, కుల్దీప్ యాదవ్ (3), అశ్విన్ (1) దక్కాయి. శతక వీరుడు అజింక్యా రహానేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. -
నేడు భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే
-
'మూడు' చెరువులు నీళ్లు తాగించారు
-
'మూడు' చెరువులు నీళ్లు తాగించారు
సఫారీలు సింహనాదం చేశారు... ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు బ్యాట్స్‌మెన్ శతకాల మోత మోగించారు. వాంఖడే మైదానం దద్దరిల్లేలా భారత జట్టు భరతం పట్టారు. ఏకంగా 438 పరుగులతో భారత గడ్డపై చరిత్రను తిరగరాసిన దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ తమ ఖాతాలో వేసుకుంది. డివిలియర్స్, డు ప్లెసిస్, డి కాక్... ఈ ‘డి’ గ్యాంగ్ టీమిండియాకు భారీ గాయం చేసింది. ఫోర్లు, సిక్సర్లు బాదడంలో వీరంతా పోటీ పడుతూ భారత బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఒక రకమైన కసితో పరుగుల వరద పారించిన దక్షిణాఫ్రికాకు ఎదురులేని విజయం దక్కింది. ప్రత్యర్థి బ్యాటింగ్ దెబ్బకు మన బౌలర్లు ఏమీ చేయలేక చేతులెత్తేసిన వేళ... పరుగులు ఇవ్వడంలో భువనేశ్వర్ సెంచరీ దాటేయగా, మిగతా వారు దాదాపుగా అలాంటి ప్రదర్శనే ఇచ్చారు. అనంతరం రహానే, ధావన్ మెరుపులు ఓ దశలో ఆశలు రేపినా... చివరకు దారుణ భంగపాటు తప్పలేదు. చివరి వన్డేలో దక్షిణాఫ్రికా ఘన విజయం * 214 పరుగులతో భారత్ చిత్తు చిత్తు * మ్యాచ్‌లో రికార్డుల వెల్లువ * డు ప్లెసిస్, డివిలియర్స్, డి కాక్ సెంచరీలు * సిరీస్ 3-2తో సఫారీల సొంతం ముంబై: సంచలన బ్యాటింగ్ ప్రదర్శనతో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. రికార్డులు వెల్లువెత్తిన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా 214 పరుగుల భారీ తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్లకు 438 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (115 బంతుల్లో 133 రిటైర్డ్ హర్ట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), డివిలియర్స్ (61 బంతుల్లో 119; 3 ఫోర్లు, 11 సిక్సర్లు), డి కాక్ (87 బంతుల్లో 109; 17 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు. రెండో వికెట్‌కు డు ప్లెసిస్, డి కాక్ 154 పరుగులు జోడించగా... మూడో వికెట్‌కు డు ప్లెసిస్, డివిలియర్స్ ఏకంగా 10.63 రన్‌రేట్‌తో 211 పరుగులు జత చేయడం ఇన్నింగ్స్‌లో హైలైట్. ఆ తర్వాత భారత్ 36 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. అజింక్య రహానే (58 బంతుల్లో 87; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్ ధావన్ (59 బంతుల్లో 60; 8 ఫోర్లు) మాత్రమే కొంత పోరాడగలిగారు. రబడ 4, స్టెయిన్ 3 వికెట్లు తీశారు. తాజా ఫలితంగా ఐదు వన్డేల సిరీస్‌ను డివిలియర్స్ బృందం 3-2తో సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో వన్డే సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. డి కాక్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’... డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారాలు లభించాయి. డి కాక్ మరో శతకం... ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో తొలి ఓవర్ మినహా ఆ తర్వాత జట్టు రన్‌రేట్ 6.52కు తగ్గలేదు. సిరీస్‌లో ఫామ్‌లో లేని ఆమ్లా (13 బంతుల్లో 23; 5 ఫోర్లు) మోహిత్ ఓవర్లో 3 ఫోర్లు బాదినా... వన్డేల్లో 6 వేల పరుగుల మైలురాయి దాటాక అదే ఓవర్లో వెనుదిరిగాడు. మరోవైపు డి కాక్ మరోసారి భారత్‌పై తన ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. ముఖ్యంగా పేసర్లు భువీ, మోహిత్లపై అతను ఎదురుదాడికి దిగి వేగంగా పరుగులు రాబట్టడంతో పవర్ ప్లేలో జట్టు స్కోరు 73 పరుగులకు చేరింది. ఏడో ఓవర్లోనే స్పిన్నర్లను బరిలోకి దించినా లాభం లేకపోయింది. 58 పరుగుల వద్ద మిశ్రా బౌలింగ్‌లో డి కాక్ ఇచ్చిన క్యాచ్‌ను మోహిత్ వదిలేశాడు. ఈ క్రమంలో 78 బంతుల్లోనే అతను సిరీస్‌లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎట్టకేలకు రైనా బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి డి కాక్ అవుట్ కావడంతో ఈ భారీ భాగస్వామ్యానికి తెర పడింది. బాదుడే బాదుడు... డి కాక్ వికెట్ తీసిన ఆనందం భారత్‌కు ఎక్కువసేపు నిలవలేదు. ఈ దశలో జత కట్టిన డు ప్లెసిస్, డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఏ బౌలర్‌నూ వదిలి పెట్టకుండా వీరిద్దరు ఒకరితో ఒకరు పోటీ పడి చితక్కొట్టారు. 85 పరుగుల వద్ద మిశ్రా క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన ప్లెసిస్ ఆ తర్వాత 105 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు కండరాలు పట్టేయడంతో డు ప్లెసిస్ రిటైర్డ్‌హర్ట్‌గా తప్పుకోవాల్సి వచ్చింది. మరోవైపు నుంచి డివిలియర్స్ తనదైన శైలిలో పండగ చేసుకున్నాడు. బ్యాటింగ్ చేయడం ఇంత సులువా అన్నట్లుగా... 11 భారీ సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన అతను 57 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన అనంతరం మూడో బంతిని ఆడబోయి డివిలియర్స్, ధోనికి క్యాచ్ ఇవ్వడంతో ఈ జోరు ఆగింది. ఆ తర్వాత చివర్లో మిల్లర్ (12 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు), బెహర్దీన్ (10 బంతుల్లో 16; 2 సిక్సర్లు) తలో చేయి వేసి దక్షిణాఫ్రికా స్కోరును 400 దాటించారు. చివరి 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా రికార్డు స్థాయిలో 144 పరుగులు చేసింది. కీలక భాగస్వామ్యం... రికార్డు విజయలక్ష్య ఛేదనలో భారత్‌కు శుభారంభం లభించలేదు. రోహిత్ శర్మ (16), విరాట్ కోహ్లి (7) తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. అయితే ధావన్, రహానే కలిసి దూకుడుగా ఆడారు. ధావన్ చాలా రోజుల తర్వాత ఆత్మవిశ్వాసంతో ఆడగా, రహానే అనూహ్యంగా తన శైలికి భిన్నంగా సొంతగడ్డపై భారీ షాట్లతో చెలరేగాడు. 27 పరుగుల వద్ద మిల్లర్ సునాయాస క్యాచ్ వదిలేయడం కూడా ధావన్‌కు కలిసొచ్చింది. ఈ క్రమంలో 51 బంతుల్లో ధావన్, 41 బంతుల్లో రహానే అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ జోడి కేవలం 14.5 ఓవర్లలో 112 పరుగులు జోడించింది. అయితే ఈ దశలో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన రబడ భారత్‌కు దెబ్బ తీశాడు. తన వరుస ఓవర్లలో అతను ధావన్, రైనా (12)లను అవుట్ చేశాడు. మరోవైపు దూకుడుగా ఆడుతున్న రహానేను స్టెయిన్ చక్కటి బంతితో బోల్తా కొట్టించడంతో భారత్ జోరుకు కళ్లెం పడింది. ఆ తర్వాత ధోని (29 బంతుల్లో 27; 3 ఫోర్లు) క్రీజ్‌లో కొద్దిసేపు నిలబడ్డా లాభం లేకపోయింది. 14 ఓవర్లు మిగిలి ఉండగానే భారత్ ఇన్నింగ్స్ ముగియడం విశేషం. పరుగుల పరంగా స్వదేశంలో భారత్‌కిదే పెద్ద ఓటమి. భువనేశ్వర్ రికార్డు దక్షిణాఫ్రికా జట్టులో ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు బాదగా, మన బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లలో 106 పరుగులిచ్చిన అతను వినయ్ కుమార్ (9 ఓవర్లలో 102)ను అధిగమించి భారత్ తరఫున కొత్త రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా మిక్ లూయీస్ (113) తర్వాత ఇది రెండో అతి చెత్త ప్రదర్శన. ఈ మ్యాచ్‌లో భువీ బౌలింగ్‌లో ఏకంగా 12 ఫోర్లు, 6 సిక్స్‌లు రాగా, మోహిత్ బౌలింగ్‌లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు వచ్చాయి. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయడం ఇది రెండో సారి. ఇదే ఏడాది వెస్టిండీస్‌పై డివిలియర్స్, ఆమ్లా, రోసో ఆ ఘనత సాధించారు. వన్డేల్లో ఇది సంయుక్తంగా మూడో అత్యధిక స్కోరు. టాప్-5లో మూడు దక్షిణాఫ్రికావే. భారత గడ్డపైనే కాకుండా భారత్‌పై కూడా ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు. గతంలో భారత్, వెస్టిండీస్‌పై ఇండోర్‌లో 418 పరుగులు చేయగా... శ్రీలంక, భారత్‌పై రాజ్‌కోట్‌లో 411 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 400కు పైగా పరుగులు చేయడం ఇది ఆరోసారి. భారత్ ఐదు సార్లు చేసింది. వన్డేల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకునేందుకు ఆమ్లా ఆడిన ఇన్నింగ్స్‌ల సంఖ్య 123.ఈ క్రమంలో కోహ్లి (136) రికార్డును సవరించాడు. ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా సిక్స్‌ల సంఖ్య 20. అత్యధిక సిక్సర్ల (22) రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉంది. డి కాక్కు భారత్‌పై ఇది ఐదో సెంచరీ, 9 ఇన్నింగ్స్‌లలోనే అతను ఈ శతకాలు చేశాడు. డివిలియర్స్‌కు ఇది 23వ సెంచరీ. ఇవన్నీ 100కు పైగా స్ట్రయిక్ రేట్‌తోనే సాధించిన ఘనత అతని సొంతం. భారత్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా, ఓవరాల్‌గా రెండో బౌలర్‌గా భువనేశ్వర్ నిలిచాడు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డి కాక్ (సి) కోహ్లి (బి) రైనా 109; ఆమ్లా (సి) ధోని (బి) మోహిత్ 23; డు ప్లెసిస్ (రిటైర్డ్‌హర్ట్) 133; డివిలియర్స్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 119; మిల్లర్ (నాటౌట్) 22; బెహర్దీన్ (సి) రైనా (బి) హర్భజన్ 16; ఎల్గర్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 438. వికెట్ల పతనం: 1-33; 2-187; 2-351 (రిటైర్డ్‌హర్ట్); 3-398; 4-430. బౌలింగ్: భువనేశ్వర్ 10-0-106-1; మోహిత్ 7-0-84-1; హర్భజన్ 10-0-70-1; అక్షర్ 8-0-65-0; మిశ్రా 10-0-78-0; రైనా 3-0-19-1; కోహ్లి 2-0-14-0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) తాహిర్ (బి) అబాట్ 16; ధావన్ (సి) ఆమ్లా (బి) రబడ 60; కోహ్లి (సి) డి కాక్ (బి) రబడ 7; రహానే (సి) బెహర్దీన్ (బి) స్టెయిన్ 87; రైనా (బి) రబడ 12; ధోని (బి) తాహిర్ 27; అక్షర్ (సి) మిల్లర్ (బి) స్టెయిన్ 5; హర్భజన్ (సి) (సబ్) మోరిస్ (బి) స్టెయిన్ 0; భువనేశ్వర్ (సి) మిల్లర్ (బి) తాహిర్ 1; మిశ్రా (ఎల్బీ) (బి) రబడ 4; మోహిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (36 ఓవర్లలో ఆలౌట్) 224. వికెట్ల పతనం: 1-22; 2-44; 3-156; 4-172; 5-185; 6-195; 7-201; 8-210; 9-219; 10-224 బౌలింగ్: స్టెయిన్ 7-0-38-3; రబడ 7-0-41-4; అబాట్ 7-0-39-1; బెహర్దీన్ 8-0-55-0; తాహిర్ 7-1-50-2. -
వన్డే సిరీస్ దక్షిణాఫ్రికాదే
ముంబై: టీమిండియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను దక్షిణాఫ్రికా చేజిక్కించుకుంది. ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో సెంచరీల మోతతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా సగర్వంగా ట్రోఫీని అందుకుంది. ఆదివారం జరిగిన చివరి డే అండ్ నైట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 214 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. దీంతో వన్డే సిరీస్ ను దక్షిణాఫ్రికా 3-2 తో కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుని 439 పరుగుల లక్ష్యాన్ని టీమిండియాకు నిర్దేశించింది. భారీ పరుగుల లక్ష్యాన్ని చేరే క్రమంలో టీమిండియా 36 ఓవర్లలో 224 పరుగులకే చాపచుట్టేసింది. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ శిఖర్ ధవన్(60), అజింక్యా రహానే(87) లు మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. రోహిత్ శర్మ(16), విరాట్ కోహ్లి(7), సురేష్ రైనా(12), మహేంద్ర సింగ్ ధోని (27 ), అక్షర్ పటేల్ (5) లు స్వల్ప పరుగులకే పెవిలియన్ కు చేరడంతో టీమిండియాకు ఘోర పరాభవం తప్పలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా నాలుగు వికెట్లు సాధించగా, స్టెయిన్ కు మూడు, ఇమ్రాన్ తాహీర్ లకు రెండు వికెట్లు లభించాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా పరుగుల మోత మోగించింది. ఓపెనర్ డీ కాక్, డు ప్లెసిస్, ఏబీ డివిలియర్స్ లు దూకుడుగా ఆడి శతకాలతో పరుగుల వరద పారించారు. డీ కాక్(109; 87 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్స్), డు ప్లెసిస్(133;115 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లు), డివిలియర్స్(119;6 బంతుల్లో 3 ఫోర్లు, 11 సిక్సర్లు) సెంచరీల నమోదు చేశారు. ఆదిలో మంచి టచ్ లో కనిపించిన ఓపెనర్ హషీమ్ ఆమ్లా (23) ను టీమిండియా తొందరగానే పెవిలియన్ కు పంపినా..ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. మరో ఓపెనర్ డీకాక్ తో కలిసి డు ప్లెసిస్ దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ ధోని సేనపై ఎదురుదాడికి దిగి రెండో వికెట్ కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం డీ కాక్ రెండో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. ఆ సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన ఏబీ డివిలియర్స్ తో డు ప్లెసిస్ జతకలిశాడు. వీరిద్దరూ కూడా ధోని సేనకు చుక్కలు చూపించారు. తొలుత డు ప్లెసిస్ సెంచరీ చేయగా, అనంతరం డివిలియర్స్ కూడా సెంచరీ మార్కును చేరాడు. ఈ జోడి 164 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో దక్షిణాఫ్రికా 44 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 351పరుగులు చేసింది. కాగా, ఆ సమయంలో డు ప్లెసిస్ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు చేరాడు. అటు తరువాత దక్షిణాఫ్రికా మరో 47 పరుగులు చేశాక డివిలియర్స్ మూడో వికెట్ రూపంలో అవుటయ్యాడు. చివర్లో బెహర్దియన్(22 నాటౌట్) బ్యాట్ ఝుళిపించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 438 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును లభించగా, డీ కాక్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈరోజు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఒకే ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు నమోదు చేసి మరోసారి తన బ్యాటింగ్ లో సత్తా చూపెట్టింది. ఈ ఏడాది జనవరిలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఒకే ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు నమోదు చేయగా.. మరోసారి టీమిండియాపై అదే రికార్డును సాధించింది. డీకాక్, డు ప్లెసిస్, ఏబీ డివిలియర్స్ లో శతకాలతో మెరిసి జట్టుకు భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డారు. దాంతో పాటు టీమిండియా భారీ పరుగులను సమర్పించుకుని చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇప్పటివరకూ టీమిండియా వన్డేల్లో సమర్పించుకున్న అత్యధిక పరుగుల రికార్డు ఇదే. అంతకుముందు టీమిండియాపై అత్యధిక పరుగుల రికార్డు శ్రీలంక (411/8) పేరిట ఉంది. -
శిఖర్, రహానేలు హాఫ్ సెంచరీలు
ముంబై:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధవన్, అజింక్యా రహానేలు హాఫ్ సెంచరీలతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. శిఖర్(58), రహానే(51) క్రీజ్ లో ఉన్నారు. దక్షిణాఫ్రికా విసిరిన 439 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 44 పరుగులకే రెండు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడ్డ టీమిండియా ఇన్నింగ్స్ కు శిఖర్, రహానేలు మరమ్మత్తులు చేపట్టారు. అంతకుముందు రోహిత్ శర్మ(16), కోహ్లి(7) పెవిలియన్ కు చేరారు. టీమిండియా 22 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 151 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. -
టీమిండియా ఆపసోపాలు
ముంబై: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక చివరి వన్డేలో 439 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆపసోపాలు పడుతోంది. టీమిండియా 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 51 పరుగులతో ఆడుతోంది. శిఖర్ ధవన్(24), అజింక్యా రహనే(8) క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు రోహిత్ శర్మ(16), విరాట్ కోహ్లి (7) పెవిలియన్ కు చేరి ఆదిలోనే నిరాశపరిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అబాట్, రబడాలకు తలో వికెట్ తీశారు. -
రికార్డుల మోత
ముంబై:దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరిగిన చివరి వన్డేలో పలు రికార్డులు నమోదయ్యాయి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసింది. దీంతో టీమిండియాపై అత్యధిక పరుగుల రికార్డును దక్షిణాఫ్రికా నమోదు చేసింది. దాంతో పాటు టీమిండియా కూడా భారీ పరుగులను సమర్పించుకుని చెత్త రికార్డును మూటగట్టుకుంది. అంతకుముందు టీమిండియాపై శ్రీలంక (411/8) నమోదు చేసిన రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికా ఒక ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు నమోదు చేయడం రెండోసారి. ఈ ఏడాది జనవరిలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మూడు సెంచరీలను సాధించింది. ఆ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 439 పరుగులు చేసింది. ఇదే వన్డే అత్యుత్తమ స్కోరుల్లో రెండోది. అత్యధిక వన్డే పరుగుల రికార్డు శ్రీలంక(443/9) పేరిట ఉంది. ఓవరాల్ గా దక్షిణాఫ్రికా నాలుగు వందల పరుగులకు పైగా స్కోరు సాధించడం ఆరోసారి. కాగా, దక్షిణాఫ్రికా ఓపెనర్ హషిమ్ ఆమ్లా సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో వేగంగా 6 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తక్కువ మ్యాచుల్లో అతడీ ఘనత సాధించాడు. 126 మ్యాచ్ ల్లో 123 ఇన్నింగ్స్ ఆడి ఆరువేల మార్కును చేరుకున్నాడు. ఇందులో 21 సెంచరీలు, 28 అర్ధసెంచరీలు ఉన్నాయి. -
శతకాలతో చితకొట్టేశారు!
-
శతకాలతో చితకొట్టేశారు!
ముంబై: టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా చివరిదైన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా పరుగుల మోత మోగించింది. ఓపెనర్ డీ కాక్, డు ప్లెసిస్, ఏబీ డివిలియర్స్ లు దూకుడుగా ఆడి శతకాలతో పరుగుల వరద పారించారు. డీ కాక్(109; 87 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్స్), డు ప్లెసిస్(133;115 బంతుల్లో 9ఫోర్లు, 6 సిక్సర్లు), డివిలియర్స్(119;6 బంతుల్లో 3 ఫోర్లు, 11 సిక్సర్లు) సెంచరీల నమోదు చేయడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 438 పరుగులు చేసింది. దీంతో పాటు ఒకే ఇన్నింగ్స్ లో మూడు సెంచరీల చేసిన అరుదైన రికార్డును దక్షిణాఫ్రికా రెండోసారి తనఖాతాలో వేసుకుంది.. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఆదినుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్ హషీమ్ ఆమ్లా(23) తొలి వికెట్ ను కోల్పోయిన అనంతరం డీ కాక్ తో కలిసిన డు ప్లెసిస్ దాటి బ్యాటింగ్ చేశాడు. వారిద్దరూ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడి రెండో వికెట్ కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలోనే డీ కాక్ రెండో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన ఏబీ డివిలియర్స్ తో డు ప్లెసిస్ జతకలిశాడు. వీరిద్దరూ కూడా ధోని సేనకు చుక్కలు చూపించారు. తొలుత డు ప్లెసిస్ సెంచరీ చేయగా, అనంతరం డివిలియర్స్ కూడా సెంచరీ మార్కును చేరాడు. వీరిద్దరూ కలిసి 164 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో దక్షిణాఫ్రికా 44 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 351పరుగులు చేసింది. కాగా, ఆ సమయంలో డు ప్లెసిస్ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు చేరాడు. అటు తరువాత దక్షిణాఫ్రికా మరో 47 పరుగులు చేశాక డివిలియర్స్ మూడో వికెట్ రూపంలో అవుటయ్యాడు. చివర్లో బెహర్దియన్(22 నాటౌట్) బ్యాట్ ఝుళిపించడంతో దక్షిణాఫ్రికా 439 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, రైనాలకు తలో వికెట్ దక్కింది. -
శతకాలతో చితకొట్టేశారు!
ముంబై: టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా చివరిదైన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా పరుగుల మోత మోగించింది. ఓపెనర్ డీ కాక్, డు ప్లెసిస్, ఏబీ డివిలియర్స్ లు దూకుడుగా ఆడి శతకాలతో పరుగుల వరద పారించారు. డీ కాక్(109; 87 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్స్), డు ప్లెసిస్(133;115 బంతుల్లో 9ఫోర్లు, 6 సిక్సర్లు), డివిలియర్స్(119;6 బంతుల్లో 3 ఫోర్లు, 11 సిక్సర్లు) సెంచరీల నమోదు చేయడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 438 పరుగులు చేసింది. దీంతో పాటు ఒకే ఇన్నింగ్స్ లో మూడు సెంచరీల చేసిన అరుదైన రికార్డును దక్షిణాఫ్రికా రెండోసారి తనఖాతాలో వేసుకుంది.. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఆదినుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్ హషీమ్ ఆమ్లా(23) తొలి వికెట్ ను కోల్పోయిన అనంతరం డీ కాక్ తో కలిసిన డు ప్లెసిస్ దాటి బ్యాటింగ్ చేశాడు. వారిద్దరూ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడి రెండో వికెట్ కు 153 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. -
దక్షిణాఫ్రికా పరుగుల వరద!
ముంబై: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియాతో ఆదివారం ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా దూకుడుగా బ్యాటింగ్ కొనసాగిస్తూ పరుగుల వరద పారిస్తోంది. కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తనదైన శైలిలో బ్యాటింగ్ కొనసాగిస్తూ టీమిండియాకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. డివిలియర్స్(51;34 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా హాఫ్ సెంచరీ చేయడంతో దక్షిణాఫ్రికా 40 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 294 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. డివిలియర్స్ కు జతగా ఫస్ట్ డౌన్ లో వచ్చిన డు ప్లెసిస్(87) క్రీజ్ లో ఉన్నాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా ఓపెనర్లు హషీమ్ ఆమ్లా (23), డీకాక్(109) పెవిలియన్ కు చేరారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఆది నుంచి బ్యాట్ ఝుళిపించడంతో నాలుగు వందల పరుగుల మార్కును దాటే అవకాశాలు కనబడుతున్నాయి. -
భారీ స్కోరు దిశగా దక్షిణాఫ్రికా
ముంబై: భారత్- దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న ఫైనల్ వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలుత ఓపెనర్ గా బరిలోకి దిగిన ఆమ్లా(23) అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన డుప్లెసిస్, ఓపెనర్ డికాక్‌లు ధాటిగా ఆడి దక్షిణాఫ్రికా స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో 87 బంతుల్లోనే డికాక్ 109 పరుగులు చేసి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. 35 ఓవర్లు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 240 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. డుప్లెసిస్(77), డివిలియర్స్(26) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. -
15 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్ 103/1
ముంబై: భారత్- దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న ఫైనల్ వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిలకడగా బ్యాటింగ్ చేస్తుంది. 15 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. డికాక్ 58, డుప్లిసిస్ 18 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. -
ఒక్కరోజులోనే వడదెబ్బకి 68 మంది మృతి
-
ఒక్కరోజు