సామీ, రస్సెల్, బ్రేవోలకు షాక్ | S Sammy, Russell, Bravo dropped from WICB contracts | Sakshi
Sakshi News home page

సామీ, రస్సెల్, బ్రేవోలకు షాక్

Jan 9 2016 5:21 PM | Updated on Sep 3 2017 3:23 PM

సామీ, రస్సెల్, బ్రేవోలకు షాక్

సామీ, రస్సెల్, బ్రేవోలకు షాక్

కొంతమంది సీనియర్ క్రికెటర్లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ) షాకిచ్చింది. 2015-16 సీజన్కు సంబంధించిన కాంట్రాక్ట్ జాబితా ను 12 నుంచి 15 మందికి పెంచిన విండీస్ బోర్డు... పలువురు కీలక ఆటగాళ్లను తొలగించింది.

సెయింట్ జోన్స్(ఆంటిగ్వా): కొంతమంది సీనియర్ క్రికెటర్లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ) షాకిచ్చింది. 2015-16  సీజన్కు  సంబంధించిన ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితా ను 12 నుంచి 15 మందికి పెంచిన విండీస్ బోర్డు... పలువురు కీలక ఆటగాళ్లను తొలగించింది. వీరిలో ట్వంటీ 20 కెప్టెన్ డారెన్ సామీ, ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో, ఆండ్రూ రస్సెల్ లకు కొత్త జాబితా నుంచి ఉద్వాసన పలికింది.

 

గతేడాది నవంబర్ లో  శ్రీలంకతో జరిగిన ట్వంటీ 20 సిరీస్ లో సామీ చివరిసారి ఆడగా, రస్సెల్ మాత్రం అదే సిరీస్ లో వన్డే సిరీస్ తో పాటు, ట్వంటీ 20 సిరీస్ లో ఆఖరిసారి పాల్గొన్నాడు. కాగా, సీనియర్ ఆటగాడు శివనారాయణ్ చంద్రపాల్ కు ఈసారి కూడా కొత్త జాబితాలో చోటు దక్కలేదు. మరోవైపు గతేడాది కాలంగా విండీస్ కాంట్రాక్ట్ జాబితాలో స్థానం కోల్పోయిన క్రిస్ గేల్ కు మరోసారి చుక్కెదురైంది.



విండీస్ నూతన కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా:  జాసన్ హోల్డర్, క్రెయిగ్ బ్రాత్ వైట్, రాజేంద్ర చంద్రిక, డారెన్ బ్రేవో, మార్లోన్ శామ్యూల్స్, డేనిష్ రామ్ దిన్, దేవేంద్ర బిషో, షానోన్ గాబ్రియేల్, బ్లాక్ వుడ్, జెరోమ్ టేలర్, షెల్డాన్ కాట్రెల్, షై హోప్, షేన్ డోవ్రిచ్, లీన్ జాన్సన్, రోచ్.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement