ప్రిక్వార్టర్స్‌లో రుత్విక ఓటమి | Rutvika defeat in the pre-quarters | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో రుత్విక ఓటమి

Nov 4 2016 12:14 AM | Updated on Sep 4 2017 7:05 PM

బిట్‌బర్గర్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగమ్మారుు గద్దె రుత్విక శివాని పోరాటం ముగిసింది.

సార్‌బ్రకెన్ (జర్మనీ): బిట్‌బర్గర్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగమ్మారుు గద్దె రుత్విక శివాని పోరాటం ముగిసింది. ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్లో పరాజయం చవిచూసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రుత్విక 16-21, 13-21తో టాప్ సీడ్ హి బింగ్ జియావో (చైనా) చేతిలో ఓడింది. జోరుమీదున్న చైనా అమ్మారుు కేవలం 29 నిమిషాల్లోనే వరుస గేముల్లో రుత్వికను ఇంటిదారి పట్టించింది. పురుషుల సింగిల్స్‌లో వర్మ సోదరులు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. 14వ సీడ్

జూ సంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్ సౌరభ్ వర్మ 9-16తో వెనుకంజలో ఉన్న దశలో చైనా ఆటగాడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సమీర్ వర్మ 21-10, 21-16తో ఈటు హెరుునో (ఫిన్లాండ్)పై గెలుపొందాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో యోగేంద్రన్ కృష్ణన్ (మలేసియా)తో జతకట్టిన ప్రజక్తా సావంత్ 21-18, 21-17తో అండర్స్ రస్మ్‌సెన్- ఫ్రుయెర్‌గార్డ్ (డెన్మార్క్) జంటపై గెలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement