‘రోజా’పై రాజీ లేదు! | Rozen soccer player | Sakshi
Sakshi News home page

‘రోజా’పై రాజీ లేదు!

Jun 29 2014 1:56 AM | Updated on Oct 22 2018 5:58 PM

‘రోజా’పై రాజీ లేదు! - Sakshi

‘రోజా’పై రాజీ లేదు!

సాకర్ ప్రపంచకప్‌లో అసలు సమరం మొదలైంది. టైటిల్‌పై గంపెడాశలు పెట్టుకున్న జట్లకు ఇకపై ప్రతీ మ్యాచ్ అగ్ని పరీక్షే.

సాకర్ ఆటగాళ్లకు రంజాన్ పరీక్ష
 రియో డి జనీరో: సాకర్ ప్రపంచకప్‌లో అసలు సమరం మొదలైంది. టైటిల్‌పై గంపెడాశలు పెట్టుకున్న జట్లకు ఇకపై ప్రతీ మ్యాచ్ అగ్ని పరీక్షే. అయితే పవిత్రమైన రంజాన్ మాసం ఆరంభం కానుండటంతో సాకర్ ఆటగాళ్లలో కొందరు  ‘ఉపవాస’ పరీక్షను ఎదుర్కోబోతున్నారు. నాకౌట్ చేరిన  జట్లలో ముస్లిం దేశమైన అల్జీరియాతో పాటు నైజీరియా, జర్మనీ, ఫ్రాన్స్... ఇలా ఆయా జట్లలో ఇస్లాం మతాన్ని స్వీకరించిన వాళ్లు, ఇస్లాంను అనుసరిస్తున్న ఆటగాళ్లు ఉన్నారు.
 
  ఈ జాబితాలో కరీమ్ బెంజెమా, మూసా సిసోకో, బాకరి సాగ్నా, మమదూ సాఖో (ఫ్రాన్స్), సామీ ఖెడిరా (జర్మనీ), జెర్దాన్ షాకిరి (స్విట్జర్లాండ్), అహ్మద్ మూసా (నైజీరియా), మరూని ఫెలైని (బెల్జియం) ప్రముఖులు. అల్జీరియా జట్టులో చాలా మంది ప్లేయర్లు ఉపవాస దీక్ష పాటించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ‘రోజా’ పాటిస్తూ మైదానంలో బరిలోకి దిగడం అంత సులువైన విషయం కాదు. ఇప్పటికే బ్రెజిల్‌లో ఎండ తీవ్రతతో ఆటగాళ్లు అల్లాడిపోతున్నారు.
 
  ఈ సమయంలో ఉపవాసం కారణంగా ఆటగాళ్లు డిహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. అయినా అల్జీరియా ఆటగాళ్లు ఉపవాసానికి వెనకాడటం లేదు. ఎంతకష్టమైనా దీనిని పాటిస్తామంటున్నారు. మరోవైపు జర్మనీకి చెందిన మెసట్ ఓజిల్ రంజాన్ మాసం ప్రారంభం కానున్నప్పటికీ... సాకర్ ప్రపంచకప్ కారణంగా ‘రోజా’కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఫ్రాన్స్ కోచ్ డెస్ చాంప్స్ ముస్లిం ఆటగాళ్ల మనోభావాలకు అనుగుణంగా తానూ కూడా వ్యవహరిస్తానని, ‘రోజా’ పాటించడాన్ని తానేమీ అడ్డుకోబోనని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement