వచ్చే ఏడాది భారత్‌కు రొనాల్డో! | Ronaldo to India next year | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది భారత్‌కు రొనాల్డో!

Nov 11 2015 12:14 AM | Updated on Oct 2 2018 8:39 PM

వచ్చే ఏడాది భారత్‌కు రొనాల్డో! - Sakshi

వచ్చే ఏడాది భారత్‌కు రొనాల్డో!

ఐఎస్‌ఎల్ మ్యాచ్‌ను తిలకించేందుకు బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో...

మకావు: ఐఎస్‌ఎల్ మ్యాచ్‌ను తిలకించేందుకు బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో... వచ్చే ఏడాది భారత్‌కు రానున్నా డు. తన స్నేహితుడు, జట్టు మాజీ సహచరుడు రొబోర్టో కార్లోస్ ఈ మేరకు అతన్ని ఆహ్వానించాడు. ‘భారత్‌కు వెళ్లడం నాకు చాలా ఇష్టం. ఐఎస్‌ఎల్ మ్యాచ్‌ను చూడాలని ఉంది. కానీ ఈ ఏడాది కుదరడం లేదు. బ్రెజిల్‌కు తిరి గి వెళ్లాల్సి ఉంది. అయితే వచ్చే ఏడాది కచ్చితంగా భారత్‌కు వచ్చి మ్యాచ్ చూస్తా’ అని ఆసియా పోకర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొం టున్న రొనాల్డో వ్యాఖ్యానించాడు.

భవిష్యత్‌లో మళ్లీ ఫుట్‌బాల్ మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం లేదని స్పష్టం చేశాడు. ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత పోకర్‌ను ప్రొఫెషనల్‌గా తీసుకున్నానని చెప్పిన ఈ బ్రెజిలియన్.. మైదానంలో ఉండే భావోద్వేగాలను మిస్సవుతున్నానని వెల్లడించాడు. 17 ఏళ్ల పాటు అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆడిన రొనాల్డో... రెండుసార్లు బ్రెజిల్‌కు వరల్డ్‌కప్ అందించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement