రోహిత్ శర్మకు సచిన్ టెస్టు క్యాప్ | Rohit Sharma gets Test cap from Sachin Tendulkar | Sakshi
Sakshi News home page

రోహిత్ శర్మకు సచిన్ టెస్టు క్యాప్

Nov 6 2013 11:23 AM | Updated on Sep 2 2017 12:20 AM

రోహిత్ శర్మ టెస్టుల్లో ఆరంగ్రేటం (ఫైల్ ఫోటో)

రోహిత్ శర్మ టెస్టుల్లో ఆరంగ్రేటం (ఫైల్ ఫోటో)

వన్డేల్లో సత్తా చాటిన టీమిండియా బ్యాట్స్మన్ రోహిత్ శర్మ టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు.

కోల్కతా: వన్డేల్లో సత్తా చాటిన టీమిండియా బ్యాట్స్మన్ రోహిత్ శర్మ టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు. వెస్టిండీస్తో ఈడెన్ గార్గెన్లో బుధవారమిక్కడ ప్రారంభమైన తొలి టెస్టులో రోహిత్ శర్మకు చోటు దక్కింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భుజం నొప్పి కారణంగా వైదొలడంతో రోహిత్కు లైన్ క్లియరయింది. ఫేర్ వెల్ టెస్టు ఆడుతున్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నుంచి టెస్టు క్యాప్ అందుకుని రోహిత్ మైదానంలో అడుగుపెట్టాడు.

అలాగే సొంత మైదానంలో తొలి టెస్టు ఆడుతున్న మీడియం పేసర్ మహ్మద్ షమీ కూడా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ నుంచి క్యాప్ అందుకుని ఆరంగ్రేటం చేశాడు. ఫామ్ కోల్పోవడంతో ఇషాంత్ శర్మకు ఈ టెస్టులో చోటు దక్కలేదు. ఉమేష్ యాదవ్, అమిత్ మిశ్రా, అజింకా రహానేకు కూడా తుది జట్టులో స్థానం లభించలేదు. ఓపెనర్ మురళీ విజయ్ మరోసారి అవకాశం దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement