రోహిత్ శర్మ సెంచరీ | rohit sharma gets half century in first twenty 20 match | Sakshi
Sakshi News home page

రోహిత్ శర్మ సెంచరీ

Oct 2 2015 8:25 PM | Updated on Sep 3 2017 10:21 AM

రోహిత్ శర్మ సెంచరీ

రోహిత్ శర్మ సెంచరీ

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి ట్వంటీ 20 మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు.

ధర్మశాల:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి ట్వంటీ 20 మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు.రోహిత్ శర్మ(106;66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు)) సెంచరీతో  ఆకట్టుకున్నాడు. దీంతో అంతర్జాతీయ ట్వంటీ20 లో తొలి సెంచరీని నమోదు చేశాడు. రోహిత్ మూడో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు విరాట్ కోహ్లి(43) వద్ద వెనుదిరిగాడు. సురేష్ రైనా(6),  మహేంద్ర సింగ్ ధోని(5)లు క్రీజ్ లో ఉన్నారు.

 

టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 22 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. శిఖర్ ధవన్(3) రనౌట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. అనవసర పరుగు కోసం యత్నించిన ధవన్ ను లాంజ్ చేతి నుంచి బంతిని వేగంగా అందుకున్న డివిలియర్స్ రనౌట్ చేశాడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement