అతడికి ఇష్టమైన క్రికెటర్‌ ఆమె! | Riyan Parag Says Ive tried to copy Smriti Mandhana | Sakshi
Sakshi News home page

అతడికి ఇష్టమైన క్రికెటర్‌ ఆమె!

May 20 2019 2:01 PM | Updated on May 20 2019 2:09 PM

Riyan Parag Says Ive tried to copy Smriti Mandhana - Sakshi

హైదరాబాద్‌: క్రికెట్‌లో ఇప్పటివరకు పురుషులదే ఆధిక్యం. కానీ ట్రెండ్‌ మారుతోంది. మహిళల క్రికెట్‌వైపు ప్రపంచం చూస్తోంది. మొన్నటివరకు ఇష్టమైన క్రికెటర్‌ ఎవరంటే సచిన్‌, ధోని, కోహ్లి అని చెప్పే కాలం చెల్లింది. ప్రస్తుత యువతరం నీకు ఇష్టమైన క్రికెటర్‌ ఎవరని ప్రశ్నిస్తే మిథాలీరాజ్‌, హర్మన్‌ప్రీత్‌, స్మృతి మంధాన అని టక్కున చెబుతున్నారు. తాజాగా 17 ఏళ్ల రాజస్తాన్‌ రాయల్స్‌ యువ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ టీమిండియా మహిళల స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన ఆటకు వీరాభిమాని అంటూ పేర్కొన్నాడు. 

‘నా జీవితంలో మా నాన్నే నాకు తొలి ప్రేరణ. ఆ తర్వాత సచిన్‌, కోహ్లిలు. మహిళల క్రికెటర్లలో స్మృతి మంధాన ఆట అంటే నాకు ఎంతో ఇష్టం. తన బ్యాటింగ్‌ స్టైల్‌ను కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తుంటాను. మ్యాచ్‌లో కళ్లద్దాలు పెట్టుకుని, బీఎస్‌ బ్యాట్‌ పట్టుకొని ఆడుతున్నప్పటి నుంచి ఆమె ఆటను నేను ఫాలో అవుతున్నాను. షాట్ల ఎంపిక, క్రీజులో ఆమె కదలికలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజా ఐపీఎల్‌ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. రహానే, స్మిత్‌ వంటి దిగ్గజాలతో ఆడటం నాకు ఎంతగానో ఉపయోగపడింది. అందరి క్రికెటర్ల లాగే నేను కూడా టీమిండియాకు ఆడాలని కలలు కంటున్నాను’ అంటూ 17 ఏళ్ల రియాన్‌ పరాగ్‌ వివరించాడు. 

తాజా ఐపీఎల్‌లో అద్భుత బ్యాటింగ్‌తో పాటు అవసరమైన దశలో బౌలింగ్‌తో రాణించిన రియాన్‌ పరాగ్‌పై అందరి దృష్టి పడింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అసాధారణరీతిలో బ్యాటింగ్‌ చేసి ఆకట్టుకున్నాడు. పరాగ్‌ బ్యాటింగ్‌కు ఫిదా అయిన స్టీవ్‌ స్మిత్‌ అతడిపై ప్రశంసల జల్లు కురిపించాడు. రహానే కూడా పరాగ్‌లో అద్భుత ప్రతిభ ఉందని, భవిష్యత్‌లో గొప్ప క్రికెటర్‌ అవుతాడంటూ అశాభావం వ్యక్తం చేశాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement