రంగారెడ్డి జట్టుకు టైటిల్‌ | rangareddy wins under 19 throw ball championship | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జట్టుకు టైటిల్‌

Dec 11 2017 10:47 AM | Updated on Dec 11 2017 10:47 AM

rangareddy wins under 19 throw ball championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్‌ జిల్లా అండర్‌-19 త్రోబాల్‌ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి, హైదరాబాద్‌ జట్లు ఆకట్టుకున్నాయి. సరూర్‌నగర్‌లోని జడ్పీహెచ్‌ఎస్‌ మైదానంలో జరిగిన ఈ టోర్నీలో బాలుర విభాగంలో రంగారెడ్డి, బాలికల విభాగంలో హైదరాబాద్‌ జట్లు టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. బాలుర ఫైనల్లో రంగారెడ్డి 16-14, 13-15, 15-13తో నిజామాబాద్‌పై గెలుపొందింది. హైదరాబాద్‌కు మూడో స్థానం దక్కింది.

బాలికల టైటిల్‌ పోరులో హైదరాబాద్‌ 15-12, 15-13 రంగారెడ్డిని ఓడించగా, ఖమ్మం జట్టు తృతీయ స్థానంలో నిలిచింది.  అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి రాఘవరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రోఫీలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement