ఎనిమిది జట్లు ఖాయం | Rajiv Shukla emphasis on IPL | Sakshi
Sakshi News home page

ఎనిమిది జట్లు ఖాయం

Jul 17 2015 12:33 AM | Updated on Sep 3 2017 5:37 AM

ఐపీఎల్‌ను వచ్చే ఏడాది కూడా ఎనిమిది జట్లతోనే నిర్వహిస్తామని, దానిని మరింతగా విజయవంతం చేస్తామని లీగ్ చైర్మన్

ఐపీఎల్‌పై రాజీవ్ శుక్లా స్పష్టీకరణ

కోల్‌కతా: ఐపీఎల్‌ను వచ్చే ఏడాది కూడా ఎనిమిది జట్లతోనే నిర్వహిస్తామని, దానిని మరింతగా విజయవంతం చేస్తామని లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా విశ్వాసం వ్యక్తం చేశారు. లీగ్‌లో చెన్నై, రాజస్థాన్ జట్లను రద్దు చేయాలని లోధా కమిటీ సిఫారసు చేసినా... ఎనిమిది జట్ల తమ ఫార్మాట్‌లో మార్పు రాదని ఆయన చెప్పారు.

‘వచ్చే ఐపీఎల్ ఇంకా పెద్ద సక్సెస్ అవుతుంది. తాజా తీర్పు ఐపీఎల్ గొప్పతనాన్ని తగ్గించదు. ఫార్మాట్‌లో మార్పు లేకుండా ఎనిమిది జట్లతోనే లీగ్ నిర్వహిస్తాం. ఆరు జట్లతో లీగ్ ఉండదు’ అని శుక్లా అన్నారు. రెండు జట్లను బీసీసీఐ నేరుగా నిర్వహించడం సహా పలు ప్రత్యామ్నాయాలు తమకు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం జరిగే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో అన్ని అంశాలు చర్చిస్తామని శుక్లా వెల్లడించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement