ఉత్తమ స్థాయికి తీసుకువెళ్లడమే నా బాధ్యత: ద్రవిడ్ | Rahul Dravid masterclass for India U-19 | Sakshi
Sakshi News home page

ఉత్తమ స్థాయికి తీసుకువెళ్లడమే నా బాధ్యత: ద్రవిడ్

Nov 20 2015 2:35 PM | Updated on Sep 3 2017 12:46 PM

ఉత్తమ స్థాయికి తీసుకువెళ్లడమే నా  బాధ్యత: ద్రవిడ్

ఉత్తమ స్థాయికి తీసుకువెళ్లడమే నా బాధ్యత: ద్రవిడ్

ఆటగాళ్లను మరింతగా రాటుదేల్చి ఉత్తమ స్థాయికి తీసుకెళ్లడమే తన బాధ్యత అని అండర్-19 క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు.

కోల్‌కతా: ఆటగాళ్లను మరింతగా రాటుదేల్చి ఉత్తమ స్థాయికి తీసుకెళ్లడమే తన బాధ్యత అని అండర్-19 క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. కాగా జట్టు ఎంపికలో తన పాత్ర ఏమీ ఉండదని స్పష్టం చేశారు. ‘ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడం వరకే నా బాధ్యత. అంతేకానీ జట్టులోకి ఎవరు ఎంపిక కావాలనే దాంట్లో నా జోక్యం ఉండదు. ఎంపికైన వారి ఆటకు మెరుగులు దిద్ది మరో స్థాయికి తీసుకెళ్లేందుకు శాయశక్తులా కషి చేస్తా’ అని ద్రవిడ్ తెలిపారు.

 

శుక్రవారం నుంచి భారత జట్టు బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ అండర్-19 జట్లతో సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి ఫిబ్రవరి 14 వరకు బంగ్లాదేశ్‌లో జరిగే అండర్-19 ప్రపంచకప్‌కు ఈ సిరీస్‌ను సన్నాహకంగా ఉపయోగించుకోనుంది. ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement