మాడ్రిడ్ ఫైనల్లో నడాల్ | Rafael Nadal reaches final in Madrid | Sakshi
Sakshi News home page

మాడ్రిడ్ ఫైనల్లో నడాల్

May 11 2014 8:56 AM | Updated on Sep 2 2017 7:14 AM

స్పెయిన్ యోధుడు రఫెల్ నడాల్ మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫైనల్కు దూసుకెళ్లాడు.

మాడ్రిడ్: స్పెయిన్ యోధుడు రఫెల్ నడాల్ మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫైనల్కు దూసుకెళ్లాడు. సెమీస్లో నడాల్  6-4, 6-3తో స్పెయిన్కే చెందిన రాబర్ట్ బాటిస్టాపై విజయం సాధించాడు. గంటా 43 నిమిషాల పాటు జరిగిన పోరులో నడాల్ వరుస సెట్లో విజయం సాధించాడు. ఈ టోర్నీలో నడాల్ ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్ చేరాడు. ఫైనల్లో నడాల్ జపాన్ ఆటగాడు కీ నిషికొరితో తలపడనున్నాడు. ఇక మహిళల సింగిల్స్ ఫైనల్లో రష్యా భామ మరియా షరపోవా, నాలుగో సీడ్ సిమోనా హలెప్ తలపడనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement