ఖతర్‌ ఓపెన్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ | Qatar Open champion Djokovic | Sakshi
Sakshi News home page

ఖతర్‌ ఓపెన్‌ చాంపియన్‌ జొకోవిచ్‌

Jan 9 2017 12:19 AM | Updated on Sep 5 2017 12:45 AM

ఖతర్‌ ఓపెన్‌ చాంపియన్‌ జొకోవిచ్‌

ఖతర్‌ ఓపెన్‌ చాంపియన్‌ జొకోవిచ్‌

సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ కొత్త ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించాడు.

దోహా: సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ కొత్త ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించాడు. ఖతర్‌ ఓపెన్‌లో ఈ మాజీ నంబర్‌వన్‌ టైటిల్‌ నిలబెట్టుకున్నాడు. ప్రస్తుత నంబర్‌వన్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌)తో 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఫైనల్‌ పోరులో జొకోవిచ్‌ 6–3, 5–7, 6–4తో విజయం సాధించాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 2,09,665 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 42 లక్షలు) లభించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో రెండో సెట్‌లో జొకోవిచ్‌ 5–4తో ఆధిక్యంలో ఉండి, తన సర్వీస్‌లో మూడు మ్యాచ్‌ పాయింట్లను సాధిం చాడు.

అయితే ముర్రే పట్టుదలతో పోరాడి మూడు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకోవడంతోపాటు జొకోవిచ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత ముర్రే తన సర్వీస్‌ను నిలబెట్టుకొని, జొకోవిచ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి సెట్‌ను 7–5 తో దక్కించుకున్నాడు. నిర్ణాయక మూడో సెట్‌లో ఏడో గేమ్‌లో ముర్రే సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.  

Advertisement
 
Advertisement
Advertisement